ఆ అమ్మాయి న్యూడ్ ఫోటో అప్ లోడ్ అవుతూనే ఉంది | North Irland girl sues Facebook for her nude photo viral

Girl sues facebook for her nude photo viral

North Irland girl sues Facebook, North Irland girl nude photo, Facebook viral nude photo, Girl Nude Pic Viral in FB, FB sued by Girl for her nude pic, Girl Nude pic in FB, Facebook naked pictures, North Irland girl nude pic in Facebook

North Irland girl sues Facebook for her nude photo viral.

రెండేళ్లుగా ఆ అమ్మాయి న్యూడ్ ఫోటో అప్ లోడ్ అవుతూనే...

Posted: 09/14/2016 10:55 AM IST
Girl sues facebook for her nude photo viral

నగ్న ఫోటోల వ్యవహారాలు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ను ఇరకాటంలో పెడుతూనే ఉన్నాయి. నిన్నగాక మొన్న వియత్నాం దాడికి సంబంధించిన బాలిక నగ్న చిత్రాన్ని బ్లాక్ చేసి ఇబ్బందులు ఎదుర్కున్న సంగతి మరిచిపోక ముందే. ఇప్పుడు మరో బాలిక నగ్న ఫోటో ప్రచురించి విమర్శలతోపాటు కోర్టుపాలు కావాల్సి వచ్చింది.

ఉత్తర ఐర్లాండ్ కు ఒక వ్యక్తి 2014 లో సదరు బాలికను బ్లాక్ మెయిల్ చేసి నగ్నఫొటోను సంపాదించాడు. ఆపై దానిని ఆ ఫొటోను ‘ఫేస్ బుక్’లో అప్ లోడ్ చేశాడని పేర్కొన్నారు. ఇటువంటి ఫొటోలను బ్లాక్ చేయాల్సిన ‘ఫేస్ బుక్’ అధికారులు, ఆ విధంగా చేయలేదని అన్నారు. అదే ఫొటోను పలుసార్లు అప్ లోడ్ చేసినా పట్టించుకోలేదని, తన క్లయింట్ పరువుకు నష్టం కల్గించిన ‘ఫేస్ బుక్’ సంస్ధ పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని బాలిక తరపు న్యాయవాది డిమాండ్ చేశారు.

అయితే, ఈ ఫొటోను మొట్టమొదట అప్ లోడ్ చేసిన వ్యక్తిపై కూడా కేసు పెడతామని అన్నారు. 2014 నవంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు పలుసార్లు తన ఫొటో ను ‘ఫేస్ బుక్’లో పోస్ట్ చేశారని, ఫేస్ బుక్ తన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని, డేటా పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించిందంటూ బాధిత బాలిక ఆరోపించింది.

అయితే, ఈ ఆరోపణలను ఖండిస్తూ ‘ఫేస్ బుక్’ యాజమాన్యం చేసిన వాదనను బెల్ ఫాస్ట్ హైకోర్టు కొట్టి వేసింది. ఈ వ్యవహారంలో ఫేస్ బుక్  భారీ జరిమానా ఎదుర్కువాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Facebook  North Irland  14 years girl  Nude pic  Sue  

Other Articles