లేడీ కానిస్టేబుళ్లకు తప్పని లైంగిక వేధింపులు | 25 women constables allege sexual harassment in Delhi

25 women constables allege sexual harassment in delhi

Delhi Women Constables sexual Harassment, sexual harassment in Delhi, sexual harassment on constables, PLD SI sexual Harassment, SI sexual Harassment on Constables

25 women constables allege sexual harassment in Delhi.

ఆ ఢిల్లీ పోలీస్ పెద్ద కామ పిశాచి

Posted: 09/13/2016 03:59 PM IST
25 women constables allege sexual harassment in delhi

లైంగిక దాడులకు ఫేమస్ అయిన దేశ రాజధాని ఢిల్లీలో ఈ మధ్య అధికార పక్షం నేతలు కూడా ఈ జాబితాలోకి చేరిపోతున్నారు. ఆప్ నేతలు ఒక్కోక్కరు, కాదు కాదు... ఒకరిని మించి మరోకరు ఈ జాబితాలో ముందంజలోనే ఉన్నారు. ప్రజా ప్రతినిధుల తర్వాత ఇక ఇప్పుడు అధికార గణం వంతు వచ్చినట్లుంది. పీఎల్ డీ లో విధులు నిర్వహిస్తున్న ఓ ఇన్ స్పెక్టర్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఏకంగా 25 మంది మహిళా కానిస్టేబుళ్లు ఫిర్యాదు చేయటంతో ఒక్కసారిగా కలకలమే రేగింది.

నాలుగు నెలల క్రితం అతగాడి వెకిలి చేష్టల గురించి ఓ మహిళా కానిస్టేబుల్ డీసీపీ కి ఫిర్యాదు చేసింది. కానీ, ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీంతో ఈసారి ఏకంగా కమిషనర్ నే కలిసి తన బాధను విన్నవించుకుంది. ఇక ఇక్కడి నుంచి మొదలైంది అసలు కథ. ఆపై ఒకరి తర్వాత ఒకరు ఏకంగా 24 మంది ఆ కామ ఖాకీపై కమిషనర్ కు కంప్లయింట్ ల వరద తాకింది.

డ్యూటీలో తమపై ఎక్కడ పడితే అక్కడ చేయి వేయ్యటమే కాదు, అసభ్యకరంగా ప్రవర్తించేవాడంట. అంతేకాదు తనకు లొంగిపోవాలని ఒత్తిడి తెచ్చేవాడని, ఒకవేళ ఎవరైనా ఎదురుతిరిగితే కెరీర్ నాశనం చేస్తానని బెదిరించేవాడని వారంతా ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీనిపై షాక్ తిన్న కమిషనర్ వెంటనే విజిలెన్స్ కమిషన్ ను విచారణకు ఆదేశించాడు. నేరం రుజువైతే అతనిపై కఠిన చర్యలు తప్పని సమాచారం. ఇన్నాళ్లూ ఆఫీసుల్లో పనిచేసే మహిళలకే అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఇందుకు ఆడ పోలీసులు కూడా మినహాయింపుకాదని ఈ ఘటన నిరూపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  Women Constables  Complaint  sexual Harassment  SI  

Other Articles