శునకంలా ప్రవర్తించిన ఎస్ఐ.. అది కరిచిందనే.. Si Shoots A Dog In Lucknow

Si shoots a dog in lucknow

Uttar Pradesh Police, UP cop shoots dog, Maneka Gandhi, Lucknow sub-inspector, Animal Welfare Board

Union minister Maneka Gandhi has sought a detailed report from the station officer at the Chinhat police station in Lucknow after a sub-inspector shot at a stray dog which had bitten him.

శునకంలా ప్రవర్తించిన ఎస్ఐ.. గ్రామసింహం కరిచిందనే..

Posted: 09/12/2016 03:55 PM IST
Si shoots a dog in lucknow

పోలీసులంటే ప్రజలకు స్నేహితులు.. కేవలం నేరస్థులకు మాత్రమే వారు సింహస్వప్నాలు అని ఇప్పటికే చాలా మంది రుజువు చేశారు. కానీ కొందరు మాత్రం తమ వద్దకు వచ్చేవారందరినీ నేరస్తులుగానే చూస్తుంటారు. అయితే ఇంకోందరు మాత్రం నేరస్థులందరినీ కూడా సమదృష్టితో చూడరు. వారు ఏ పరిస్థితుల ప్రభావంతో నేరాలకు పాల్పడ్డారన్న అంశాన్ని కూడా పరిశీలించి.. వారిపట్ల కొంత ఔదార్యంగా వ్యవహరిస్తుంటారు. వీటన్నింటికీ భిన్నంగా వుండే వారు కూడా వున్నారు. వారితోనే యావత్ పోలీసు శాఖ విమర్శల పాలవుతుంది.

ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని చిన్హట్‌కు చెందిన ఎస్‌ఐ మహేంద్ర ప్రతాప్, బరాబంకీలో విధులను నిర్వహిస్తున్నాడు. అనుకోకుండా అయన ఓ మూగజీవి వద్దకు వెళ్లాడు. అంతే వచ్చింది ఎస్ఐ అని, ఓ పోలీసు అధికారి అని, సాక్షాత్తు యమభటుడని తెలియక ఓ మూగజీవి తన నైజాన్ని ప్రదర్శించింది. ఈ సమయంలో అతడిని ఓ వీధి కుక్క కరిచింది. దీంతో ఒక్కసారిగా రాక్షసుడిలా ప్రవర్తించాడు. ఇంట్లో ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీని తీసుకువచ్చి కుక్కను రోడ్డుపైనే కాల్చిచంపాడు.

కుక్కను చంపిన ఎస్‌ఐపై పోలీసులు కేసునమోదు చేయకపోవడంతో జంతు హక్కుల ఉద్యమకారులు పోలీసులపై మండిపడుతున్నారు. జంతువుల సంక్షేమ సంఘం కో-ఆప్ట్ మెంబర్ కామ్నా పాండే స్పందిస్తూ... కుక్క స్థానంలో మనుషులు ఉన్నా ఇలాగే ప్రవస్తారా? అని ప్రశ్నించారు. ఘటనపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనకా గాంధీకి ఫిర్యాదు చేశారు. ఘటనపై స్పందించిన మంత్రి పూర్తీ వివరాలను తెలుసుకున్నారు. ఎస్‌ఐపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles