ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. చంద్రబాబుకు చెంపపెట్టు.. setback to andhrapradesh government, high court stays swiss challenge

Setback to andhrapradesh government high court stays swiss challenge

Ap government, Andhra pradesh, amaravathi, swiss challenge, high court, chandrababu, YSRCP, high court, stay, Swiss Challenge, Aditya constructions, NVN Engineers

The Hyderabad High Court has admitted a petition filed by Aditya Constructions and Chennai-based NVN Engineers Private Limited and adjourned the hearing to October 31, while directing the AP government to file its counter.

చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. అమరావతి నిర్మాణంపై..

Posted: 09/12/2016 03:14 PM IST
Setback to andhrapradesh government high court stays swiss challenge

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని, ఇందుకోసం స్విస్ ఛాలెంజ్ విధానాన్ని కూడా అవలంభిస్తున్నామని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం అనురిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రపంచస్థాయి నగర నిర్మాణం కోసమే స్విస్ ఛాలెంజ్ పద్ధతి పాటిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని అవకాశం తమకు కలిగినందుకు అత్యుత్తమ రాజధానిని అత్యున్నత ప్రమాణాలతో నిర్మిస్తున్నామని గత కొన్నాళ్లుగా చెప్పుకోచ్చిన చంద్రబాబుకు హైకోర్టు స్టే చెంపపెట్టులాంటిదన్న విమర్శలు కూడా వినపిస్తున్నాయి.  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు ప్రభుత్వం స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని ఎంచుకోవడాన్ని సవాలు చేస్తూ ఆదిత్య కన్స్ట్రక్షన్స్, చెన్నైకు చెందిన ఎన్వీఎన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ స్విస్‌ చాలెంజ్‌ విధానంలో లొసుగులున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ap government  Andhra pradesh  amaravathi  swiss challenge  high court  chandrababu  

Other Articles