అనుప్రియతో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కేసు | FIR Against 150 For Misbehaving With Union Minister Anupriya Patel

Fir against 150 for misbehaving with union minister anupriya patel

Misbehave with Anupriya Patel, Anupriya Patel case, Union Minister Anupriya Patel misbehaved, attack on Anupriya Patel

FIR Against 150 For Misbehaving With Union Minister Anupriya Patel.

ఆమెతో మిస్ బిహేవ్ చేసిన 158 మందిపై కేసు

Posted: 09/12/2016 04:01 PM IST
Fir against 150 for misbehaving with union minister anupriya patel

కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ తో అనుచితంగా ప్రవర్తించారంటూ ఏకంగా 158 మందిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రతాప్ గఢ్ లోకి ఓ రోడ్ షోలో పాల్గొనేందుకు వెళ్లిన ఆమె కాన్వాయ్ ను అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దాడి చేయడమే కాకుండా, ఆమెపై అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో 158 మందిపై రాణీగంజ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలైంది.

"స్థానిక నేత వినోద్ దూబే, మరో 157 మందిపై కేసు పెట్టాము. వీరంతా గత రాత్రి కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్, అప్నాదళ్ కార్యకర్తలు నిర్వహిస్తున్న రోడ్ షోపై దాడికి దిగారు. మంత్రితో అనుచితంగా ప్రవర్తించారు. ఈ మేరకు, వారి ఫిర్యాదు మేరకు కేసు పెట్టాం" అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో వినోద్ దూబే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాలన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. అనుప్రియా మాత్రం దాడి అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ కుట్రేనని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Union Minister  Anupriya Patel  road Show  Misbehave  FIR  

Other Articles