మరిన్ని మాల్యా అస్తుల అటాచ్ పై ఈడీ దృష్టి.. Mallya PMLA case: ED to attach fresh assets

Mallya pmla case ed to attach fresh assets

vijay mallya, kingfisher airlines, mallya fraud, enforcement directorate, 1995 india-uk mutual legal assistance treaty (mlat),ed, vijay mallya fraud, mallya tax evasion, mallya laundering, mallya money laundering case, mallya prevention of money laundering act, mallya tax, mallya news, national news

Tightening its noose around Vijay Mallya, ED has decided to issue a third attachment order against the fugitive liquor baron in connection with its money laundering probe.

మరిన్ని మాల్యా అస్తుల అటాచ్ పై ఈడీ దృష్టి..

Posted: 09/12/2016 10:15 AM IST
Mallya pmla case ed to attach fresh assets

లిక్కర్ కింగ్ గా పేరొంది.. ఉద్దేశ పూర్వక బ్యాంకుల రుణ ఎగవేతదారుగా మారి.. అర్థిక నేరస్థుడిగా విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాకు ఈడీ మరోమారు షాక్ ఇచ్చేందుకు దృష్టిసారించింది. బ్యాంకులతో సెటిల్ మెంటు డ్రామాలను నడిపి తప పబ్బం గడుపుకుందామని భావించిన ఆయనకు చెందిన మరిన్ని ఆస్తులను అటాచ్ చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఇప్పటికే ఈడీ రెండు దఫాల్లో మాల్యాకు చెందిన రూ.8,401 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.

తొలి విడతగా రూ.6 వేల కోట్లకు ఆ తరువాత 2 వేల 4 వందల కోట్ల రూపాయల పైగా ప్రాపర్టీలను అటాచ్ చేసింది. మూడో దఫాలోనూ వేల కోట్లలో ఆస్తులను స్తంభింపజేయవచ్చని, ఈసారి అటాచ్ చేయబోయే వాటిలో విదేశీ ఆస్తులు కూడా ఉన్నాయని తెలుస్తున్నది. ఇప్పటివరకు మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని(పీఎంఎల్‌ఏ) నిబంధనల ప్రకారంగా అటాచ్‌మెంట్ జరుపగా.. ఈసారి మాత్రం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారంగా జప్తు చేయనున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.

బ్యాంకులకు రూ.9000 కోట్లకు పైగా ఎగవేసిన కేసులో ఇప్పటికే పలుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ విచారణకు ప్రత్యక్షంగా హాజరు కాకపోవడంతో ముంబై కోర్టు మాల్యాను ఘోషితాపరాధిగా ప్రకటించింది. తను భారత్‌కు తిరిగి రావాలనుకుంటున్నప్పటికీ ప్రభుత్వం తన పాస్‌పోర్టును రద్దు చేసిన కారణంగా వీలుకావట్లేదని రెండ్రోజుల క్రితం ఢిల్లీ సిటీ కోర్టుకు మాల్యా విన్నవించుకున్నారు. ఆయన తరఫున న్యాయవాది ఈ విషయాన్ని చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి సుమిత్ దాస్ ముందు వెల్లడించారు. ఫెరా చట్టం నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి గతంలో జారీ అయిన సమన్లను బేఖాతరు చేసినందుకు మాల్యాపై కేసు నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijay mallya  kingfisher airlines  mallya fraud  enforcement directorate  ED  

Other Articles