రాముడు కలలో కనిపించాడని రామకోటి రాస్తున్న ముస్లిం కుటుంబం | Warangal muslim family writes Rama Koti.

Warangal muslim family writes rama koti

Warangal muslim family, Warangal muslim family writes Rama koti, Warangal muslim devotees, Muslim family writes Rama Koti

Warangal muslim devotees for Lord Rama and family writes Rama Koti.

రాముడు కలలో కనిపించాడని ఏకంగా...

Posted: 09/12/2016 12:05 PM IST
Warangal muslim family writes rama koti

ఓ పక్క మతోన్మాదం పెరిగిపోతుంది. రెచ్చగొట్టే ప్రసంగాలు, కవ్వింపు చర్యలతో అల్లర్లు రేపేందుకు దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయి. అయినా వారి పప్పులు ఉడకటం లేదు. మీ పిచ్చితో మాకు పనిలేదంటూ కుల, మతాలకు అతీతంగా ప్రజలు కలిసి మెలిసి ఉంటున్నారు. ముఖ్యంగా ఒక మతం దైవాన్ని మరోకరు పూజించడమనే భక్తి భావం ద్వారా ఆ బంధాన్ని మరింత బలపరుచుకుంటున్నారు. అలాంటివి కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా చూశాం. కానీ, ఇక్కడి ఉదంతం మాత్రం కాస్త ప్రత్యేకం...

వరంగల్ జిల్లాలోని హన్మకొండ కు చెందిన ఓ ముస్లిం కుటుంబం సర్వమతాలు ఒక్కటేన‌న్న సందేశాన్ని తెలుపుతోంది. తన దైవంతోపాటే రాముడికి సమానంగా పూజలు చేస్తున్నారు. ఏకంగా  రామ‌కోటి ర‌చ‌న‌కు ఇప్ప‌టికే శ్రీ‌కారం చుట్టిన ఆ దంపతులు తాజాగా వినాయక చవితి సంద‌ర్భంగా గ‌ణ‌నాథుని విగ్రహాన్ని త‌మ‌ ఇంట్లో ప్రతిష్ఠించారు. , కాపువాడ లో నివాసముంటున్న ఎండీ.యాకూబ్‌పాషా, యాస్మిన్‌ దంపతులు అన్ని మ‌తాలు ఒక‌టేన‌న్న భావంతో ఆధ్యాత్మిక చింత‌న‌ను త‌మ జీవ‌నంలో భాగంగా చేసుకున్నారు.

వృత్తిరీత్యా పెయింటర్ అయిన యాకూబ్‌పాషా గ‌త ఏడాది త‌మ జిల్లాలోని గణేష్‌నగర్‌ కాలనీలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప‌నిచేశాడు. శ్రీరామ స్తూపం నిర్మాణ పనుల్లో పాల్గొన్న ఆయ‌న‌కు భద్రాచలంలోని శ్రీరాముని విగ్రహం కలలో కనిపించింది. దీంతో ఆయ‌న భద్రాచలం రాములోరి స‌న్నిధికి వెళ్లి స్వామిని దర్శించుకున్నాడు. అనంత‌రం రామకోటి రచనకు శ్రీకారం చుట్టాడు. అంతేకాదు, శ్రీరాముని చిత్రపటాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి భార్య, పిల్లలతో క‌లిసి పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. అంద‌రూ క‌లిసి శ్రీరామ కోటి రాస్తున్నారు. తాము ప్ర‌తిరోజు నమాజ్‌ చేస్తామ‌ని.. అలాగే ఉదయం, సాయంత్రం రాముని చిత్రపటానికి దండం పెట్టుకుంటామ‌ని చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Warangal  Muslim Family  Rama Koti  

Other Articles