బీఫ్ తిన్నారని రేప్ చేశారు | Mewat women Gangraped for eating beef killed relatives

Mewat women gangraped for eating beef killed relatives

Mewat women Gangraped for eating beef, Mewat two rape and two killed for ate Beef, Mewat gangrape beef, beef rape

Mewat women Gangraped for eating beef killed relatives.

బీఫ్ తిన్నారని యువతుల గ్యాంగ్ రేప్, ఇద్దరి హత్య

Posted: 09/12/2016 08:46 AM IST
Mewat women gangraped for eating beef killed relatives

బీఫ్ మరోసారి దేశంలో ప్రకంపనలు పుట్టించింది. హర్యానాలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. బీఫ్ తిన్నారనే నెపంతో ఓ కుటుంబంపై దాడికి దిగిన కొందరు దుండగులు ఆ కుటుంబంలోని ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరో ఇద్దరిని దారుణంగా కొట్టి చంపారు.

మేవాత్ లో వారం రోజుల క్రితమే ఈ ఘటన జరగ్గా, దుండగుల భీకర దాడితో బెంబేలెత్తిపోయిన బాధిత మహిళలు నిన్నటిదాకా నోరు విప్పేందుకే భయపడ్డారు. చివరకు నిన్న కాస్తంత ధైర్యం చేసిన బాధితులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బీఫ్ తిన్నారన్న ఆరోపణలతో దుండగుల దండు ఓ రోజు బాధితుల ఇంటిలోకి చొరబడింది. భయాందోళనలతో వణికిపోతున్న 14, 20 ఏళ్ల యువతులపై దుండగుల దండు సామూహిక అత్యాచారం చేసింది. ఆ సమయంలో వారి అత్తామామలు అడ్డుకునే ప్రయత్నం చేయగా, వారిని మంచానికి కట్టేసి తీవ్రంగా కొట్టారు. దాంతో వారిద్దరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ఘోరంపై ఆదివారం బాధితుల నుంచి అందిన ఫిర్యాదుతో రంగంలోకి దిగినర పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

కాగా, హర్యానాలో గోవధ నిషేధం. ఎవరైనా బీఫ్ ను అమ్మినా, దాచినా 10 ఏళ్ల జైలు శిక్షతోపాటు, లక్ష నుంచి 5 లక్షల దాకా జరిమానా విధిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mewat  women  Gangrape  ate  beef  

Other Articles