పవన్ కల్యాన్ పై విమర్శలా..? సిగ్గుచేటు pawan kalyan gets left party support

Pawan kalyan gets left party support

CPI leader ramakrishna, chandra babu, venkaiah naidu, pawan kalyan, seemadhardhula atma gourava sabha, janaseena party,kakinada, powerstar fans, janasena workers, AP special status

communist party of india Andhra pradesh secretaty ramakrishna supports actor turned politician janasena president pawan kalyan and critises TDP and BJP leaders for critising him

పవన్ కల్యాన్ పై విమర్శలా..? సిగ్గుచేటు

Posted: 09/11/2016 04:19 PM IST
Pawan kalyan gets left party support

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించాలని, అందుకు చిన్నా, పెద్దా.. వారు వీరు అందరూ కలసి ఉద్యమించాలని తిరుపతి ప్రస్తాన సభతో పాటు కాకినాడ సీమాంధ్రుల అత్మగౌరవ సభ నుంచి పిలుపునిచ్చిన సినీనటుడు, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు మద్దుతుగా ఓ పార్టీ అండగా నిలించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యక హోదా కోసం పవన్తో కలిసి పోరాటం చేస్తామని సీపీఐ సీనియర్ నేత రామకృష్ణ ప్రకటించారు, పార్టీలు, సిద్దాంతాలు, జెండాలు, అజెండాలు అనేకం వున్నా.. నష్టాల ఊభిలో చిక్కకున్న నవ్యాంద్ర ప్రగతికోసం ప్రత్యేక హోదా కావాలని.. దానిని సాధించాలని అందుకు అన్ని పార్టీలు ఐక్యంగా కదిలిరావాలని ఆయన పేర్కొన్నారు.

ప్రత్యేక ప్యాకేజీ అంశం తాజా పరిణామాలపై గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయని ఎంపీలు ఇప్పుడు సిగ్గు లేకుండా పవన్పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాచిపోయిన లడ్డూలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెరొకటి తింటున్నారని ఎద్దేవా చేశారు. ప్యాకేజీపై చంద్రబాబు రకరకాల ప్రకటనలు చేస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై చంద్రబాబు ఇప్పటికే ఐదు రకాల ప్రకటనలు చేశారని చెప్పారు. ఇకనుంచి ఏపీలో బీజేపీ నిర్వహించే ప్రతి బహిరంగ సభ వద్ద నిరసన తెలుపుతామని సీపీఐ నేత రామకృష్ణ హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles