చొరబాటుదారులను అడ్డుకున్న అర్మీ.. 4 ముష్కరుల హతం Army foils infiltration bid, 4 militants 1 cop killed

Army foils infiltration bid 4 militants 1 cop killed

encounter at nowgam, J&K unrest, Jammu and Kashmir, kashmir millitants, kashmir infilteration, Jammu and Kashmir unrest, Kashmir conflict, Nowgam LoC, india news, national news

Army foiled an infiltration bid along the Line of Control in Nowgam sector of Kashmir's Kupwara district, killing four militants in an ongoing operation.

చొరబాటుదారులను అడ్డుకున్న అర్మీ.. 4 ముష్కరుల హతం

Posted: 09/11/2016 01:34 PM IST
Army foils infiltration bid 4 militants 1 cop killed

పాకిస్థాన్ భారత్ భూభాగంలోకి అక్రమ చోరబాట్లను ప్రోత్సహిస్తుందని, ఇందుకు ఆ దేశ ఆర్మీ కూడా సహకరిస్తుందని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అరోపణలు చేస్తున్నా.. దాయాధి వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. తెరపైకి నంగనాచి కబర్లు చెబూతూ, ప్రకటనలు చేస్తూనే.. తెరచాటుగా మాత్రం అన్ని అక్రమ కార్యకలాపాలకు తెరలేపుతోంది. తాజాగా ఇవాళ జమ్మూకాశ్మీర్ పరిధిలోని నౌగామ్ సెక్టారులో వాస్తవాధీన రేఖ వద్ద పాక్ ముష్కరుల చొరబాటు యత్నాన్ని భారత భద్రతా దళాలు తిప్పికొట్టాయి. భారీ ఎత్తున ఆయుధాలు ధరించిన నలుగురు సరిహద్దులు దాటి ఇండియాలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండటాన్ని పసిగట్టిన సైన్యం వారిని హతమార్చింది.

చొరబాటుదారుల నుంచి నాలుగు ఏకే-47 రైఫిళ్లతో పాటు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు సీఆర్పీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు పుల్వామా జిల్లాలోని కరీంబాఫ్ జిల్లాలో సోదాలు నిర్వహించిన సైన్యం 12 మందిని అరెస్ట్ చేసింది. ఈ రైడింగ్ సందర్భంగా తమ గృహాలను నాశనం చేస్తున్నారని పలువురు గ్రామస్తులు రాళ్లు రువ్వడం, ఆపై భద్రతాదళాలు వారిని అడ్డుకోవడంతో 25 మందికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu kashmir  indian army  pakistan millitants  infilteration  

Other Articles