నవ్యాంధ్రకు ప్రత్యేకహోదా ప్రకటించకపోవడంపై ఉండవల్లి అనుమానాలు.. Centre Deceiving AP alleges Undavalli Arunkumar

Centre deceiving ap alleges undavalli arunkumar

Undavalli Arunkumar, Prime Minister Modi, special status, Andhra pradesh, Industrial Investments, Gujarat, AP Reorganization Act, chandrababu naidu,

Undavalli Arunkumar said: “Is Prime Minister Modi fearing that if special status is awarded, AP will get industrial investments from Gujarat. It’s Naidu’s responsibility to tell the public what’s’ the truth.”

నవ్యాంధ్రకు ప్రత్యేకహోదా ప్రకటించకపోవడంపై ఉండవల్లి అనుమానాలు..

Posted: 09/11/2016 12:32 PM IST
Centre deceiving ap alleges undavalli arunkumar

గుజరాత్ ఎడారిగా మారుతుందన్న బలమైన కారణం నేపథ్యంలోనే నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హాదాను కేంద్రం కల్పించడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అరోపించారు. ప్రత్యేక హోదాను ఎందుకు ఇవ్వడం లేదన్న అంశంపై తన మనసులోని అనుమానాన్ని ఉండవల్లి బయట పెట్టారు. "దీని వెనుక ఓ పెద్ద విషయం ఉందన్నది నా అనుమానం మాత్రమే. నేను పర్సనల్ గా ఫీలయ్యేది ఏంటంటే... విభజన నాడు మోదీగారు లేరు. ఇప్పుడాయనకు ఓ సమస్య ఉంది.

రాష్ట్రానికి ఉన్న పెద్ద అసెట్ ఏంటంటే, కేజీ బేసిన్. కేజీ బేసిన్ లో ఇంకా గ్యాస్ నిల్వలు, గుర్తించనివి చాలా ఉన్నాయి. వీటి విలువ వేల కోట్ల నుంచి లక్షల కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఇండస్ట్రీ అంతా కూడా... ఈ రిలయన్స్ అంతా కూడా గుజరాత్ తీరంలో ఉన్నాయి. ఇక్కడ గనుక స్పెషల్ కేటగిరీ స్టేటస్, నో ఎక్సైజ్ డ్యూటీ అంటే, వాళ్లందరూ వచ్చి ఇక్కడ పెడతారండీ. ఇక మోదీ రాష్ట్రంలో పరిశ్రమలు మిగలవు. కాకినాడ, వైజాగ్ కలిసిపోతాయి. ఈ ఐదేళ్లలో టాక్స్ ఎగ్జంప్షన్స్ తో ఓ 20 పర్సెంట్ లాభం పొందుతారు. కోటి రూపాయలు పెడితే ఓ 20 లక్షలు ఉట్టినే లాభం వస్తుందన్నారు.

గుజరాతీ వాళ్లు పెద్ద వ్యాపారస్తులు. వారు ఆకర్షింపబడతారు. టక్ మని మొత్తం అందరూ ఇక్కడకు షిఫ్టయిపోతారు. అందుకని స్పెషల్ కేటగిరీ స్టాటస్ ఆపేశారా? అన్నది తన వ్యక్తిగత అనుమానమన్నారు. దీనికి తోడు ప్రధాని నరేంద్రమోడీ, అర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, బీజేపి అధ్యక్షుడు అమిత్ షా ఇలా కేంద్రంలో వున్న పెద్దలందరూ గుజరాత్ కు చెందినవారు కావడం కూడా ఏపీకి ప్రత్యేక హోదా కాకుండా చేస్తుంది తప్ప,, 14వ ఫైనాన్స్ కమీషన్ కాదని అయన అన్నారు, తాను పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చైర్మన్ గా పనిచేశాను కాబట్టి, ఇక్కడున్న నిల్వల విలువ తెలుసు. ఇదే మనకు పెద్ద అసెట్. రేపు రాబోయే రోజుల్లో వీటిని సరిగ్గా వాడుకోగలిగితే ఏపీకి తిరుగుండదు. ఈ అమరావతి, రాజధానిని కట్టక్కర్లేదండీ" అని ఉండవల్లి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles