సైకిల్ పంక్చర్ అయ్యిందా..? లేక విరిదిందా..? కదలడం లేదు.. has cycle punctured or broken.? its not moving

Has cycle punctured or broken its not moving

congress, BJP, samajwadi party, vice president rahul gandhi, PM modi, election promises, uttar pradesh assembly eleection, up cm akhilesh yadac, cycle, mayawati, BSP, SP

congress vice president rahul gandhi questions PM modi on not fulfilling his election promises, and asks uttar pradesh voters has akhilesh cycle punctured or broken..? as its not moving.

సైకిల్ పంక్చర్ అయ్యిందా..? లేక విరిదిందా..? కదలడం లేదు..

Posted: 09/11/2016 08:12 AM IST
Has cycle punctured or broken its not moving

రెండున్నరేళ్లయినా ప్రధాన మంత్రి దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీకి విదేశీ పర్యటనలకే సమయం సరిపోవడం లేదని, ఇక అయన దేశ ప్రజల సమస్యలను ఎలా తీర్చుగలరని ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందుకు విదేశాల్లోని నల్లడబ్బును తీసుకువచ్చి.. దేశ ప్రజల ప్రతీ ఒక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయల మేర వేస్తానని చెప్పిన మోడీ కోసం ప్రజలు వేచిచూస్తున్నారని వ్యంగస్త్రాలు సంధించారు.

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నెలరోజల పాటు 223 శాసనసభ నియోజకవర్గాలను మీదుగా కొనసాగనున్న రాహుల్  'డియోరియా టు ఢిల్లీ' యాత్రలో భాగంగా యూపీలోని ఖేటసారియాలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు, ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీ గుప్పించిన హామీలను నేరవేర్చలేదమని నిలదీశారు, ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత ఎంతగానో ఎదరుచూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాహుల్ విమర్శలు గుప్పించారు. ఇక దేశంలోకి బుల్లెట్ రైళ్లను తీసుకువస్తానని హామీ కూడా రెండున్నరేళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదని మండిపడ్డారు,

ఇక పనిలోపనిగా సమాజ్వాదీ పార్టీపై కూడా విమర్శలు గుప్పించారు. ఇక ఉత్తర్ ప్రదేశ్ లోనూ ప్రజలు ఓట్లేసి గెలిపించిన సైకిల్ (సమాజ్‌వాదీ పార్టీ సింబల్) ముందుకు కదలట్లేదని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. అంతకు ముందు ఏనుగు(బీఎస్పీ ఎన్నికల గుర్తు)ను తొలగించి సైకిల్‌కు అధికారం ఇస్తే అది కదలటం లేదన్నారు. సైకిల్‌ పంచరైందో లేక విరిగిపోయిందో తెలియదుగాని అది మాత్రం కదలడం లేదంటూ ప్రజల కేరింతల మధ్య రాహుల్ ప్రసంగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress  BJP  samajwadi party  rahul gandhi  PM modi  up cm akhilesh yadac  cycle  mayawati  BSP  SP  

Other Articles