వైద్యుడికి పాదాభివందనం చేసిన పవన్ కళ్యాణ్ | Pawan Kalyan Touches Feet of a Doctor in Kakinada

Pawan kalyan touches feet of a doctor in kakinada

Pawan Kalyan Touches Doctor Feet, Pawan touch doctor feet, Dr Chandra Shekhar pawan kalyan

Pawan Kalyan Touches Feet of a Doctor in Kakinada.Dr Chandra Shekhar, who had earlier offered his medical services in Canada now services in Kiran kanti hospital.

ITEMVIDEOS:ఆ వైద్యుడి పాదాలకు పవన్ ఎందుకు మొక్కాడు?

Posted: 09/10/2016 05:41 PM IST
Pawan kalyan touches feet of a doctor in kakinada

ప్యాకేజీకి వ్యతిరేకంగా గళం విప్పి ప్రత్యేక హోదా స్వరాన్ని పెంచిన జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాకినాడలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈరోజు ఓ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఓ డాక్ట‌ర్‌కి పాదాభివంద‌నం చేయటం విశేషం. కెనడా నుంచి వచ్చిన డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ స‌మాజానికి చేస్తోన్న సేవ‌ల‌ను గుర్తించిన పవన్ ఆయ‌న‌కు పాదాభివందనం చేశారు.

త‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా పట్టణంలోని కిర‌ణ్ కంటి ఆసుప‌త్రిని సంద‌ర్శించిన ప‌వ‌న్.. ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లో మొక్క‌ను కూడా నాటారు. ఆసుపత్రిలో ఓ రోగిని ప‌రామ‌ర్శించిన అనంత‌రం సంకురాత్రి చంద్రశేఖర్ ను ప‌వ‌న్ అభినందించారు. ఆయ‌న స‌మాజానికి చేస్తున్న సేవ ఎంతో ప్ర‌శంస‌నీయ‌మైంద‌ని ప‌వ‌న్ అన్నారు. భార్యాబిడ్డల్ని కోల్పోయినప్ప‌టికీ సామాజిక బాధ్య‌త‌ను గుండెల్లో నింపుకున్న‌ డాక్టర్ చంద్ర‌శేఖ‌ర్ ఎంతో మంది రోగుల‌కి కంటి చూపునిచ్చార‌ని ప‌వ‌న్ అన్నారు.

డాక్టర్ కిరణ్ చేస్తోన్న సేవ ఎంతో స్ఫూర్తిదాయ‌క‌మ‌ని కితాబిచ్చారు. ప‌వ‌న్ డాక్ట‌ర్‌కి పాదాభివంద‌నం చేయ‌డాన్ని చూసిన సద‌రు ఆసుపత్రి సిబ్బంది, అక్క‌డే ఉన్న ప‌వ‌న్‌ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. పవన్ డాక్ట‌ర్ ప‌ట్ల ప్ర‌ద‌ర్శించిన తీరు ఆయ‌న‌ మానవతాదృక్పథానికి నిదర్శనమని ప‌వ‌న్‌ని కొనియాడారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని ఎటువంటి ఈగో లేని వ్యక్తిగా అభివర్ణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Kakinada  Doctor  Chandra Shekhar  Feet  

Other Articles