వెంకటరమణ మృతిపై స్పందించిన పవన్, ఆర్థికంగా ఆదుకుంటానని హామీ | pawan kalyan press note on Kakinada fan death

Pawan kalyan press note on kakinada fan death

Pawan Kalyan press note on fan death, pawan response on kakinada fan death, Pawan fan death in kakinada sabha, Pawan venkata ramana family

Pawan Kalyan press note on fan death in kakinada, Financial aid to Venkataramana family.

అభిమాని మరణం కలచివేసింది ... ఇకపై సభలు నిర్వహించేది లేదు: పవన్

Posted: 09/10/2016 12:55 PM IST
Pawan kalyan press note on kakinada fan death

సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో నిన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌సంగించిన అనంత‌రం చోటుచేసుకున్న అపశ్రుతిలో వెంకటరమణ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ పత్రికా ప్రకటన ద్వారా స్పందించాడు. ‘చేతికి అంది వచ్చిన కొడుకు మరణిస్తే ఆ తండ్రికి కలిగే గర్భశోకం - ఆ కుటుంబ సభ్యులు పడే ఆవేదన అర్థం చేసుకోగలనని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆసుపత్రికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను స్వయంగా కలుసుకుందాం అనుకున్నాగానీ భద్రతా కారణాల రీత్యా వెళ్లడం కుదరలేదని పవన్ అందులో తెలిపాడు.

వెంకట రమణ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా అన్నారు. త‌న‌ అభిమాని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాన‌ని చెప్పారు. వెంక‌ట‌ర‌మ‌ణ చ‌నిపోవ‌డం బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకూడ‌ద‌నే తాను స‌భ‌లు ఏర్పాటు చేయ‌డం లేదని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ఇకపై సభలు నిర్వహించబోనని స్పష్టం చేశారు. ఇక హోదా కోసం ప్ర‌జాప్ర‌తినిధులు రాజీనామాలకు సిద్ధపడాలని ప‌వ‌న్ క‌ల్యాణ్ డిమాండ్ చేశారు. వారు పోరాటం చేయాలని సూచించారు. ప్ర‌జాప్ర‌తినిధుల‌కు చేత‌కాక‌పోతే తానే పోరాటానికి దిగుతాన‌ని అందులో మరోసారి స్పష్టం చేశాడు.

కాగా, కాజులూరు మండలం కయ్యేరు గ్రామం లో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటరమణ పెయింటింగ్‌ పని చేస్తుంటాడు. అతడికి తల్లి తండ్రి, సోదరి, తమ్ముడు ఉన్నారు. సోదరికి మాటలు రావు. తండ్రి తరువాత ఆ కుటుంబానికి దిక్కు వెంకటరమణే కూలి పని చేసుకుంటే గాని నోటిలోకి ముద్ద దిగదు. ఇన్ని రోజులు ఆ కుటుంబానికి అండగా ఉంటు పోషిస్తున్నాడు. వెంకటరమణ చిన్నతనం నుంచే పవన్‌కు వీరాభిమాని. వృత్తిరీత్యా పెయింటరైన రమణ పవన్‌కళ్యాణ్‌లకి సంబంధించిన బ్యానర్లు, జెండాలను పూర్తి చేస్తున్నాడు. గ్రామంలో కూడా ఎప్పుడూ పవనిజం టీ షర్టులు వేసుకునే వెంకటరమణ తిరిగేవాడు. శుక్రవారం జరిగిన సభకు వెళ్లే అభిమానులకు జెండాలకు సైతం రంగులద్దాడు. రెట్టించిన ఉత్సాహంతో మిత్రులతో కలిసి వెళ్లాడు. ఊహించని సంఘటనతో ఆ కుటుంబం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడగా, తాను ఆదుకుంటానని పవన్ ముందుకు రావటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  kakinada  Meeting  Venkataramana  Fan death  

Other Articles