రిలయన్స్ జియో అన్ లిమిటెడ్ డేటా ఉత్తదే | Reliance Jio internet speed drops after unlimited data offer opens to all

Reliance jio internet speed drops after unlimited data offer opens to all

Reliance Jio internet speed drops, Reliance Jio internet data conditions, Reliance Jio fraud, Reliance Jio no unlimited data, Reliance Jio data packages, Reliance Jio calls fraud, Reliance Jio All no free, Reliance Jio 4GB fraud

Reliance Jio internet speed drops after unlimited data offer opens to all.

రిలయన్స్ జియో పేరిట జరుగుతున్న మోసం తెలుసా?

Posted: 09/10/2016 11:48 AM IST
Reliance jio internet speed drops after unlimited data offer opens to all

అపరిమిత డేటా, ఉచిత కాల్స్ పేరిట ఊదరగొట్టిన రిలయన్స్ జియో కోసం వినియోగదారులు ఎగబడిపోతున్న క్రమంలో దాని వెనుక ఉన్న కపట నాటకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు వరకు అపరిమిత డేటాను ఉచితంగానే ఇవ్వనున్నట్లు ఇటీవలే ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, జియో సిమ్ తీసుకునే వినియోగదారుడికి పరిమితంగా అన్ని ఆఫర్లను వర్తింపజేస్తోంది రిలయన్స్.

అయితే తాజాగా ఆ కంపెనీ నుంచి విడుదలైన విధివిధానాలు పరిశీలిస్తే ముఖేశ్ అంబానీ ప్రకటన అవాస్తవమని తేలిపోతోంది. రోజుకు ఒక్కో వినియోగదారుడికి కేవలం 4 జీబీ డేటా మాత్రమే అందుబాటులో ఉంటుందట. ఈ 4 జీబీ డేటా అయిపోగానే కనీసం ఇంటర్నెట్ సర్ఫ్ చేసుకోవడం కుడా కుదరదట. 128 కేబీపీఎస్ స్పీడ్‌తో నెట్ అందుబాటులో ఉంటుందని తాజాగా కంపెనీ వెల్లడించింది. ఇక హైస్పీడ్ ఇంటర్నెట్ ఉందన్న భావనతో పెద్ద ఫైల్స్ డౌన్ లోడ్ చేసుకునే వినియోగదారులు ఈ జియో సేవలతో మరింత ఇబ్బందులకు గురి కాక తప్పదన్న మాట.

ఈ సిమ్‌ను ఉపయోగించి సినిమాలు, వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారికి ఇది నిజంగా చేదువార్తనే చెప్పాలి. హెచ్‌డీ సినిమా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే కనీసం సినిమా నిడివిని బట్టి 1జిబి నుంచి 3జిబి వరకూ ఉంటుంది. ఇక కాల్స్ విషయంలో కూడా త్వరలో కొన్ని ట్విస్ట్ లు ఇవ్వబోతుందనే సమాచారం అందుతోంది. ఈ లెక్కన రిలయన్స్ జియో ఆల్ ఫ్రీ అంటూ చివరికి కండిషన్స్ అప్లై అని చివర్లో పెట్టిన మెలికపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reliance Jio  Unlimited Data  4gb  slow  

Other Articles