ఆత్మగౌరవ సభలో పవన్ అసలు ఏం మాట్లాడాడు? | Analysis on pawan speech Seemandhrula Atma Gaurava Sabha

Pawan kakinada speech analysis

Analysis on pawan Kakinada speech, pawan speech Seemandhrula Atma Gaurava Sabha, Seemandhrula Atma Gaurava Sabha, pawan Kakinada speech

Analysis on pawan speech Seemandhrula Atma Gaurava Sabha.

ఆత్మగౌరవ సభ ద్వారా అసలేం చెప్పదల్చుకున్నాడు?

Posted: 09/09/2016 06:33 PM IST
Pawan kakinada speech analysis

తిరుపతి సభకు కాకినాడ సభకు స్పష్టమైన తేడా ఉంది. తిరుపతిసభలో ప్రత్యేక హోదాలో పోరాడాలని నేతలకు పిలుపునిచ్చిన పవన్, కాకినాడ ఆత్మగౌరవ సభలో గొంతు మార్చారు. అసలు సభలో ఏం మాట్లాడతారు అని జైట్లీ ప్రకటనతో మొదలైన ఉత్కంఠపై పవన్ ప్రసంగం నీళ్లు చల్లిందనే చెప్పుకోవాలి. అయితే ఈ సభ ద్వారా ఒక విషయం మాత్రం పవన్ స్పష్టం చేయగలిగాడు. బీజేపీ, టీడీపీలపై మాటల యుద్ధం చేయటం మూలంగా తాను వారి పేక ముక్క కాదు అని తేల్చి చెప్పేశాడు.

జైట్లీ ప్రకటనను స్వాగతించకుండా ప్యాకేజీ అంశాన్ని మొదట్లో ఏకీపడేస్తూ ప్రసంగించాడు. కేవలం ప్రజలను మోసం చేస్తుందన్న విమర్శలతోపాటు మోదీ పాలనలో అచ్చెదిన్ లేవంటూ రాజకీయ పోరాటానికి కూడా తెరలేపాడు. ఇంకోవైపు టీడీపీ ఈ రెండున్నరేళ్లలో చాలా తప్పులు చేశారని, కొత్త రాష్ట్రం కదా అని ఇన్నాళ్లూ ఊరుకున్నానని చెప్పుకోచ్చాడు. అంటే ప్రత్యేక హోదా పరిధిని దాటి పొలిటికల్ సబ్జెక్ట్ తో పవన్ విమర్శలు గుప్పించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ లతో దోస్తీ కట్టే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. అదే సమయంలో తన భావజాలాలకు దగ్గరి సంబంధాలు ఉన్న వామపక్షాలతో మూడో ప్రత్యామ్నయం ఏర్పాటు చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేం.   

నాన్ స్టాప్ గా జరిగిన స్పీచ్ లో కామెడీ, ఎమోషన్స్ రెచ్చగొడుతూ, చెప్పాలనుకున్న అంశాన్ని సూటిగా చెప్పటం లాంటి కలగూరగంపగా పవన్ ప్రసంగం సాగింది. బీజేపీతో సంబంధాలు తెంచుకోండి అంటూ తెలుగుదేశంకు సూచించాడే తప్ప, తాను ఎలా పోరాటం చేస్తాడో అన్న విషయాన్ని చెప్పలేకపోయాడు. బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడుని, టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన మరీ చురకలు అంటించాడు. ఆచరణ సాధ్యం కానీ హామీలను మ్యానిఫెస్టోలో పెట్టకండి అని చెబుతూనే, రోషం లేకపోతే కారం తిని పార్లమెంట్ లో పోరాడండి అని ఎంపీలపై మండిపడ్డాడు.

తెలుగుదేశం నాయకులకు ఎంపీలకు ఒకటి చెబుతున్నాను... దయచేసి మా సీమాంధ్రుల గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని కేంద్రంవద్ద తాకట్టుపెట్టొద్దు,  తలదించుకునేలా చెయ్యొద్దు. గట్టిగా మాట్లాడండి గొంతెత్తి మాట్లాడండి.. గుండెత్తి మాట్లాడండి.. మీరు చెప్పండి. మీరు చెప్పండి... మావల్ల కాదు మేము చేతులు ఎత్తేశాం.. ప్రత్యేక హోదాపై మేము పోరాడలేం అని.. అప్పుడు జనసేన వస్తుంది.. అది చూపిస్తుంది.. దేశం మొత్తన్ని స్థంబింపచేస్తుంది అంటూ రాజకీయ రంగంలోకి దిగుతున్నామనే సంకేతాలు పంపించాడు. అంతేకానీ, తాను రంగంలోకి దిగితే కార్యాచరణ ఎలా ఉండబోతుంది, దానిని ముందకు ఎలా తీసుకెళ్లబోతున్నాడు విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేకపోయాడు.  

పవన్ కాకినాడ సభ అనౌన్స్ చేయగానే వణికిపోయిన బీజేపీ, టీడీపీలు ప్యాకేజీ అనౌన్స్ చేయడం ద్వారా తీవ్రత కాస్త తగ్గించొచ్చని అనుకుంది. కానీ, సీన్ టోటల్ గా రివర్స్ అయ్యింది. హోదా ఇవ్వటం లేదని స్పష్టంగా చెప్పినా ఇంకా ఇస్తారా? ఇవ్వరా ? అని అడగటం వెనుక ఆంతర్యం అర్థం కావటంలేదు. అసలైన హోదా అంశం మాత్రం ప్రసంగంలో అంత హైలెట్ కాలేదన్నది ఒప్పుకోవాల్సిన విషయం. పౌరుషం, ఆత్మగౌరవం లాంటి పదాలతో జనాల్లో భవిష్యత్తులో రాజకీయాలకు బాటలు మాత్రం వేసుకుంటున్నారని అర్థమౌతుంది. అయితే మాస్ ఫాలోయింగ్ తనకున్న ఇమేజ్ ను సరిగ్గా వాడుకోలేకపోయిన పవన్ రాజకీయ వేడిని రాజేసేందుకు ఈ సభను అంతగా వాడుకోలేదని చెప్పుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  speech  Kakinada  Seemandhrula Atma Gaurava Sabha  

Other Articles