ప్రజలు కాదు నేతలు రోడ్డెక్కి పోరాడాలి | pawan kalyan kakinada speech

Pawan kalyan kakinada speech

pawan kalyan kakinada public meeting speech, pawan kalyan kakinada public meeting

pawan kalyan kakinada public meeting speech.

ఆత్మగౌరవ సభ హైలెట్స్ 5:అందరూ విఫలమైతే రంగంలోకి దిగుదానుకున్నా, కానీ...

Posted: 09/09/2016 05:38 PM IST
Pawan kalyan kakinada speech

రాష్ట్రంలో ఎంతో మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు, వీరంతా పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకు వస్తారన్న భావనతోనే తాను రోడ్లపైకి రాలేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించాడు. తాను ముందుకు దిగితే, అభిమానులంతా రోడ్లపైకి వస్తారని, వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే చూస్తూ ఉన్నానని చెప్పాడు. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతో పాటు బీజేపీ కూడా హోదాను తెచ్చేందుకు కృషి చేస్తాయని, ఎన్నికైన ప్రజా ప్రతినిధులుగా అది వారిపై ఉన్న బాధ్యతని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చానని పవన్ చెప్పాడు. అందరూ విఫలమైన తరువాత తాను రోడ్లపైకి రావాలని అనుకున్నానని ఆ సమయం వచ్చిందని చెప్పాడు.

ఆంధ్ర‌నాయ‌కుల్లో పౌరుషం ఏమ‌యింద‌ని ఆయన ప్ర‌శ్నించారు. కారం తింటే వ‌స్తుంద‌ని సూచించారు. ‘టీజీ వెంకటేష్ గారు నన్ను కుంభకర్ణుడన్నారు. మీ మీద, తెలుగు దేశం ప్రభుత్వం మీద నేను కూడా మాట్లాడగలను. మీరు నడుపుతున్న సంస్థలపై మాట్లాడగలను. మీరు నాకు రాజకీయాల గురించి చెప్పవ‌ద్దు అవకాశావాద రాజకీయాలు నేను చేయట్లేదు’ అని పవన్ అన్నారు. మరో ఎంపీ అవంతి శ్రీనివాస్ ను ఉద్దేశించి ఆయన రాజీనామా చేస్తే తాను, జనసేన కార్యకర్తలు దగ్గరుండి గెలిపిస్తామని హామీ ఇచ్చాడు.

‘మీరెంత సంస్కారహీనమైన మాటలు మాట్లాడినా నేను సంస్కారయుతంగా మాట్లాడుతున్నా. మిమ్మల్ని కుర్చీలు ఎక్కిస్తే మీరు మ‌మ్మ‌ల్నే వెక్కిరిస్తున్నారా? చాలా గొప్ప‌గా వెంక‌య్య నాయుడు ఏపీలో బీజేపీని పూర్తిగా చంపేశారు. ఆనాడు తెలంగాణ‌లో ఎంతో మంది చ‌నిపోయినా.. ఇటు స‌మైక్యాంధ్ర కోసం ఆంధ్రులు పోరాడినా జాతీయ పేప‌ర్ల‌లో ఆ వార్తలు రాలేదు.. మా క‌డుపుకోత మీకు క‌నిపించ‌దా?’ అని పవన్ అన్నారు.

‘కేంద్ర మంత్రుల మునిమ‌వళ్లు, మ‌న‌వ‌రాళ్లు ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా జాతీయ ప‌త్రిక‌ల్లో వ‌స్తుంది. మా బాధ మాత్రం రాదు. నాయ‌కులు చేసిన త‌ప్పుకి జ‌నం బాధ‌ప‌డ‌కూడ‌దు.
న‌న్ను కాకినాడకు వ‌చ్చి ఏం చేస్తావు అంటున్నారు. నేను పొలిటిక‌ల్ డ్రామా చేయాల‌నుకుంటే తాడో పేడో తేల్చుకుంటా. సీపీఐ రామ‌కృష్ణ‌కి కృతజ్ఞ‌త‌లు తెలుపుతున్నాను. వామ‌ప‌క్ష పార్టీలు నాకు మ‌ద్ద‌తు తెలిపాయి. సీతారాం ఏచూరి మాట్లాడింది నాకు బాగా నచ్చింది. అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు’ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

రేపటి బంద్ గురించి ప్రస్తావిస్తూ, దానిలో పాల్గొంటారా? వద్దా? అన్నది కార్యకర్తల ఇష్టమని చెప్పాడు. "మీరెందుకు కష్టపడాలి? పదవుల్లో కూర్చున్నది ఎవరు? పార్లమెంటులో కూర్చున్నది ఎవరు? పార్లమెంట్ క్యాంటీన్లో సబ్సిడీ ఫుడ్ తింటున్నది ఎవరు? వాళ్లని ధర్నాలు చేయమని చెప్పండి. వాళ్లను నిలదీయమని చెప్పండి. మీరెందుకు కష్టపడాలి? మీరు చదువుకోవాలి. మీరు ఉద్యోగాలు చేయాలి. మీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. బిడ్డలను బాగా చూసుకోవాలి. ధర్నాల్లో ఎందుకు దిగాలి? నేతల పప్పులు ఇక ఉడకవు. వారు పోరాటం చేయాల్సిందే. వారిని నిలదీయండి" అంటూ తన అభిమానులకు పిలుపునిచ్చి చివర్లో భారత్ మాతా కీ జై... జైహింద్ అంటూ ముగించాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  Kakinada  Public Meeting  

Other Articles