అవకాశ రాజకీయాల వల్లే ఇదంతా | pawan fire on AP leaders in kakinada sabha

Pawan fire on ap leaders in kakinada sabha

pawan about telangana history in kakinada Sabha, pawan kalyan speech at kakinada sabha, pawan speech at Kakinada meeting, Athma Gaurava Sabha, Janasena Public meeting

pawan about telangana history and fire on AP leaders in kakinada sabha.

ITEMVIDEOS:ఆత్మగౌరవ సభ హైలెట్స్ 4:తెలంగాణ అంటే ప్రేముంది... జానపద పాట పాడిన పవన్

Posted: 09/09/2016 04:58 PM IST
Pawan fire on ap leaders in kakinada sabha

రాజకీయాల్లో తనను ఎవరో వెనుక ఉండి నడిపిస్తున్నారనే వార్తలను పవన్ ఖండించారు. నన్ను ఒకరు నడిపించాలా? నాకు పౌరుషం లేదా? ప్రజా సమస్యలే నాకు గాడ్ ఫాదర్ అంటూ అనగానే అభిమానులు కేరింతలు కొట్టారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రజలు తన సొదరులని చెప్పిన పవన్ తెలంగాణ హిస్టరీ, ఉద్యమం గురించి చెప్పుకొచ్చాడు. ఓవైపు హైకోర్టు ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేస్తే... ఇంకోవైపు ప్యాకేజీ అంటూ హోదా ఇవ్వకుండా నవ్యాంధ్రను మోసం చేశారని ఆక్షేపించారు.

"మనం ఈ రోజున స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టేటస్ వంటి పదాలు మన డిక్షనరీలోకి కొత్తగా వచ్చాయి. వీటిని మాట్లాడేముందు మన పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలి. స్వాతంత్రం వచ్చిన తరువాత ఉమ్మడి రాష్ట్రంలో మనకు సరైన న్యాయం జరగకపోతే, అమరజీవి పొట్టి శ్రీరాములు 50 రోజులకు పైగా నిరాహారదీక్ష చేసి మనం సంపాదించుకున్న రాష్ట్రం ఇది. ఆరోజున తెలంగాణ లేదు ఆంధ్రప్రదేశ్ లో. కానీ, ఒకవైపు ఇక్కడ స్వాతంత్ర సమరం వేడుకలు జరుగుతూ ఉంటే... ఇక్కడ మనం తెలంగాణ గురించి తెలుసుకోవాలి. వాళ్లు మన సోదరులు, అన్నదమ్ములు. వాళ్లూ మన ఆడపడుచులు, బిడ్డలు. తెలంగాణలో అప్పుడు నిజాం నిరంకుశ పాలన సాగింది. రజాకార్లు దోపిడీలు చేశారు. మానభంగాలు చేశారు. తెలుగుభాషను నేర్చుకోనివ్వకుండా చేశారు. ఆ సమయంలోనే తెలంగాణ ప్రజలు వెనుకబడ్డారు. ఆ సమయంలో అన్నదమ్ముల్లా ఉంటారని ఏపీని తెలంగాణను కలిపారు. ఆపై రెండు దశాబ్దాల తరువాత, ఏదైతే విధివిధానాలతో కలిసుండాలని అనుకున్నారో... అది చేయకపోయే సరికి జై తెలంగాణ ఉద్యమం మొదలైంది. దాన్ని కేంద్రం సమాధాన పరిచింది" అంటూ గత చరిత్రను చెప్పుకొచ్చాడు.ఆ సందర్భంగా స్నేహితుడు - సన్ని హితుడు - తెలంగాణ కవి మాస్టర్ జీ పేరు ప్రస్తావిస్తూ ఓ పాటను పవన్ ఆలపించాడు. 

 

ఆపై సమస్య మరింతగా పెరిగిందని, రాష్ట్రం విడిపోతే తమ ఉద్యోగాలు తమకే దక్కుతాయన్న భావనతో తెలంగాణ నేతలు, యువత ఉద్యమించారని గుర్తు చేశాడు. అ సమయంలోనే జరిగిన నేటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు జై ఆంధ్రా ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పాడు. తెలంగాణలో ఉద్యమించి ప్రాణత్యాగాలు చేసిన వారికి ఆనాటి ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ పార్లమెంట్ సాక్షిగా క్షమాపణలు చెప్పి, రాష్ట్రాలను విడగొట్టేది లేదని స్పష్టం చేశారు. కానీ, అదే 150 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ, అదే విధానాన్ని ఎందుకు కాపాడుకోలేక పోయారని ప్రశ్నించారు? అవకాశవాదపు రాజకీయాలు కాంగ్రెస్ చేయడం వల్ల సీమాంధ్ర ప్రాంత యువకులకు ఇబ్బందులు వచ్చాయని దుయ్యబట్టారు. అంబేద్కర్ ఫోటోలకు, విగ్రహాలకు దండలు వేయటం కాదని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చాడు. రాష్ట్రానికి హోదాను ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా అన్ని పార్టీలూ అంగీకరించాయని, దానికి కూడా విలువ లేదా? అంటూ పవన్ ప్రశ్నించాడు. 'సిగ్గు తెచ్చుకోండి మీరు' అంటూ మాట్లాడారు.

తెలంగాణ నాయకులు సీమాంధ్ర నాయకుల సన్నాసులు, చవటలు అని గతంలో అన్నప్పుడు తనకు ఎంతో బాధ కలిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకులు కనీసం ఒక్కసారైనా ఇది సరికాదని మాట్లాడిన పాపాన పోలేదని వారిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ అడ్డగోలుగా విభజన చేసిందని, ఇది తనను ఎంతో వేదనకు గురించేసిందన్నారు. విభజన తీరుకు బాధపడి 11 రోజులు అన్నం మానేశానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 42 ఏళ్ల తర్వాత బయటకు పొమ్మన్నప్పుడు బాధ ఉండదా? అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజలు ఎన్నో బాధలు పడ్డారని, వెనుకబడ్డారన్న విషయంలో కొంత వాస్తవం ఉందని ఆయన అన్నారు. అయితే అందుకు సీమాంధ్ర నాయకులను మాత్రమే తప్పుపట్టడం సరికాదన్నారు. జైపాల్‌రెడ్డి, జానారెడ్డి వంటి తెలంగాణ నాయకులు కూడా ఉన్నారు. ప్రభుత్వంలో పదవులు చేపట్టిన తెలంగాణ నేతలు ఉన్నారు. వారికి కూడా బాధ్యత ఉంది కదా అని ప్రశ్నించారు. తెలంగాణ అంటే తనకు ప్రేమ ఉందని, ప్రజల కష్టాలను చాలా దగ్గరగా చూశానని అన్నారు. అయితే అడ్డగోలు విభజన, ఏపీకి హోదా ఇస్తామని చెప్పి కేంద్రం పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని, ఆ లడ్డూలు వారి ముఖానికే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Kakinada  seemandhra athma gaurava sabha  janasena  publi meeting  

Other Articles