ప్రజా సమస్యలపై పోరాడే శక్తి సంపాదించాను | pawan speech at kakinada sabha

Pawan speech at kakinada sabha

pawan kalyan speech at kakinada sabha, Atma Gourava Sabha Kakinada

pawan kalyan speech at kakinada sabha.

ఆత్మగౌరవ సభ హైలెట్స్ 3:ప్రజా సమస్యలపై పోరాడే శక్తి సంపాదించా

Posted: 09/09/2016 04:41 PM IST
Pawan speech at kakinada sabha

రాజకీయాలంటే గడ్డం గీసుకున్నంత ఈజీ కాదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి అదే రాజకీయ నేతలు రాష్ట్రాన్ని గడ్డం గీసుకున్నంత ఈజీగా విడగొట్టొచ్చా అని పవన్ ప్రశ్నించారు.భారతీయ జనతా పార్టీ గడ్డం గీసుకున్న తరువాత మిగిలిపోయిన బ్లేడు ముక్కలు పడేసినట్టుగా ప్యాకేజీని పడేసిందని విమర్శించారు. తాను అవకాశవాద రాజకీయాలు చేసేందుకు రాలేదని, సైద్ధాంతిక బలంతో వచ్చానని, ప్రజా సమస్యలను చదివి వచ్చానని అన్నాడు.

"నేను సినిమాలు చేయొచ్చుగాక. సినిమా హీరోని కావచ్చుగాక. కానీ మీలాగా నేను వేలకు వేలు ఎకరాలుగానీ, వేలకు వేల కోట్ల డబ్బులుగానీ సంపాదించుకోలేదు. నాకు అవసరం లేదు. మా తాత గొప్ప రాజకీయనాయకుడు కాదు. కోటీశ్వరుడు కాదు. పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేసిన ఓ సామాన్య పోస్ట్ మ్యాన్ మాత్రమే. నేను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న ఓ పోలీస్ కానిస్టేబుల్. ఇదీ మా జీవిత చరిత్ర. మాకు 'మా తాతలు నేతులు తాగారు. మా మూతుల వాసన చూడండి' అనే చరిత్ర లేదు. మావాళ్లు చాలా చాలా సామాన్యులు. మామూలు వ్యక్తులు. అందుకే నాకూ అందరిలాగా బతకడం ఇష్టం" అన్నాడు.

"ఈ మధ్యన ప్రతిఒక్కరూ సినిమాలు అన్నా చెయ్యి, రాజకీయాలు అన్నా చెయ్యి అంటున్నారు. సినిమాలు మానేయమంటే ఈ క్షణమే వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను. వదిలేయమంటారా?" అని తన బహిరంగ సభకు అసంఖ్యాకంగా తరలివచ్చిన అభిమానులను ఉద్దేశించి పవన్ ప్రశ్నించారు. దీనికి 'వద్దూ' అని దిక్కులు పిక్కటిల్లేలా సమాధానం వచ్చింది. "నేను సినిమాలు వదిలేసిన రోజున మీరే నన్ను పోషించాలి. నాకు తినడానికి కూడా డబ్బుల్లేవు. మీరే ఇవ్వాలి నాకు. మీ ఒక్కొక్కళ్ల ఇంటికి వచ్చి అమ్మా, అక్కా నాకు అన్నం పెట్టు. ఆకలేస్తుంది అని అడుగుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాను.

రాజకీయాల మీద నాకు అవగాహన ఉంది. నేను కడుపుమంట చూశాను. సమస్యలను చూశాను. బాధలను చూశాను. నా కష్టాలను నేను మరచిపోలేదు. అందుకే నేను రాజకీయాల్లోకి రావాలి, ప్రజా సమస్యలపై పోరాడాలి అంటే ఏం చేయాలి? ఎలా ముందడుగు వేయాలన్నది తెలుసుకున్నాను. అందరి చరిత్రలూ చదివాను. సామాజిక తత్వం తెలుసుకున్నాను. సామాజిక శాస్త్రం చదివాను. కేవలం చదివితే కాదు, జీవితంలో ఎంతో కొంత పాటించాలన్న ఉద్దేశంతో నాకు తోచినట్టు పాటించాను. ఒక పోరాటం చేయాలంటే సరైన, బలమైన ఆలోచనా విధానం కావాలి. అదిప్పుడు నాకుంది" అంటూ పవన్ కల్యాణ్ ప్రసంగం కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Speech  Janasena  Atma Gourava Sabha  Kakinada  

Other Articles