పవన్ సీమాంధ్రుల ఆత్మగౌరవ సభకు అంతా సిద్ధం | all eyes on pawan kakinada sabha

All eyes on pawan kakinada sabha

Seemandhrula Athma Gaurava Sabha Kakinada, Kakinada Pawan Sabha, Janasena meeting in Kakinada, pawan kalyan Kakinada sabha, Seemandhrula Atma Gaurava Sabha

All eyes on Pawan Klayan kakinada Seemandhrula Athma Gaurava Sabha.

అందరి చూపు పవన్ ఆత్మగౌరవ సభ వైపే...

Posted: 09/09/2016 01:00 PM IST
All eyes on pawan kakinada sabha

ఆంధ్రప్రదేశ్ హోదా అన్నది ఆత్మగౌరవం లాంటిదని, దానిని సాధించేవరకు విశ్రమించనని తిరుపతి సభలో ప్రకటించి ఏపీ రాజకీయాల్లో పెను తుపాన్ సృష్టించాడు టాలీవుడ్ అగ్రనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇందుకోసం ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి పోరాటం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నేడు జనసేన నిర్వహించబోయే సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో ప్రసంగించనున్నాడు.

కాకినాడలోని జేఎన్టీయూ మైదానంలో సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ సభకు ఏర్పాట్లు పూర్తికాగా, ఇప్పటికే అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. 30 వేలకుపైగా చేరుకోగా, దాదాపు లక్ష మంది సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఆత్మగౌరవ సభకు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవటం విశేషం. నిజామాబాద్, కరీంనగర్, ధర్మపురి, ఖమ్మం తదితర ప్రాంతాలకు చెందిన యువత మైదానానికి చేరుకుంది. తామంతా పవన్ వీరాభిమానులమని, ఆయనేం మాట్లాడతారో వినేందుకే వచ్చామని వీరంతా చెబుతున్నారు. మరోవైపు సభ ప్రారంభమయ్యే సమయం దగ్గర పడ్డా కొద్దీ, వేదిక వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవటంతోపాటు ఈ సభకు మూడంచెల బారికేడ్లు, భద్రతను ఏర్పాటు చేసిన పోలీసు వర్గాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా నగరమంతా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు.

ఇక పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ఈ సభకు సీపీఐ మద్ధతు ప్రకటించింది. హోదాపై కేంద్రం మాట త‌ప్పిందని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ. ప్యాకేజీ పేరుతో మ‌రోసారి మోసం చేశారని మండిప‌డ్డాడు. ఈ దశలో పవన్ చేస్తున్న పోరాటానికి తామంతా మద్ధతు ప్రకటిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

ఇక తిరుపతి సభలో పవన్ కళ్యాణ్ హోదా పైన టిడిపి, వైసిపి, కాంగ్రెస్ పార్టీలను విమర్శించినప్పటికీ.. బీజేపీనే ఎక్కువ టార్గెట్ చేశారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని, కాంగ్రెస్ పార్టీలాగే మీరూ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ప్యాకేజీ ప్రకటించిందన్నది వాదన. విభజన గాయాలు, ఆర్థికలోటుతో కూనరిల్లుతున్న ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఆవశ్యకమంటూ నిర్వహిస్తున్న ఈ సభలో దాదాపు రెండు గంటలపాటు పవన్ ఏం ప్రసంగిస్తాడా అని అంతా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ అనే పేరుతో దానికి మరింత హైప్ తీసుకొచ్చిన పవన్ తన వైఖరిపై ఏంటో స్పష్టం చేస్తాడని ఐదున్నర కోట్ల మంది చూపు ఇప్పుడు సభవైపే ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Kakinada  Seemandhrula Atma Gaurava Sabha  

Other Articles