నవ్యాంద్రకు లక్షా 50 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీ.. centre may give Rs 1.5 lakh special package to Andhra pradesh

Centre may give rs 1 5 lakh special package to andhra pradesh

Andhra pradesh, Andhra pradesh special status, Andhra pradesh special package, chandrababu, chandrababu naid, andhra, arun jaitley, PM modi, suresh prabhu, ap, ap news, ysrcp, tdp, ys jaganmohan reddy, jana sena, pawan kalyan, opposition parties, congress, chandrababu news. india news

According to sources, Modi government may give Rs 1.5 lakh special package to Andhra pradesh in place of special status

నవ్యాంద్రకు రూ. లక్షా 50వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ..?

Posted: 09/07/2016 07:31 PM IST
Centre may give rs 1 5 lakh special package to andhra pradesh

రాష్ట్ర పునర్విభజనతో అతలాకుతలమైన నవ్యాంధ్రప్రదేశ్ ను అన్నివిధాల అదుకునేందుకు కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ సంసిద్దత వ్యక్తం చేస్తూ.. అందుకు ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ను కూడా ప్రకటించేందుకు సన్నదమైంది. తిరుపతిలో జనసేన అధినేత పవన్ కల్యాన్.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించని పక్షంలో ఇకపై  తమ పార్టీకి, తమ మిత్రపక్ష పార్టీ బీజేపితో మైత్రి కొనసాగదని కూడా కుండబద్దలు కొట్టిన నేపథ్యంలో కేంద్రంలో కదలికలు మొదలయ్యాయి.

రాజ్యసభలో ఏపీకి ప్రత్యేకహోదా కల్పించాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు వాయిదా పడిన సమయంలో బల్లలు చరిచి.. హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి సుజనా చౌదరి.. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కీలక భూమిక పోషిస్తున్నారుగా మారారు. ఢిల్లీలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సురేష్ ప్రభు, ప్రధాన మంత్రి కార్యాలయ అధికారులతో పాటు ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి తో అయన చర్చోపచర్చలు సాగిస్తున్నారు. ఉదయం నుంచి కేంద్రమంత్రులు చంద్రబాబుతో టచ్ లో వున్నారు.

కాగా ముసాయిదా బిల్లును ఫైనల్ చేసిన అర్థికశాఖ.. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)కు పంపింది. పీఎంఓ నుంచి స్పష్టత వచ్చిన వెంటనే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు కూడా పాల్గొననున్నట్లు సమాచారం. అయితే విశాఖ రైల్వే జోన్ పై మాత్రం ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదు. ఏపీలో పరిశ్రమలు నెలకొల్పే సంస్థలకు ప్రకటించే రాయితీతో పాటు పారిశ్రామిక విధానానికి నిధి ఏర్పాటుపై కూడా స్పష్టత రాలేదని వీటిని పరిశీలించి.. షైనల్ చేసిన అనంతరం ప్యాకేజీని ప్రకటిస్తారా..? లేక వాటిని తరువాత ప్రకటిస్తారా..? అన్న విషయంలోనూ సందిగ్ధతం నెలకొంది.

కాగా, పారిశ్రామిక రాయితీలు మినహా మిగతా అంశాలు ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. విశాఖ- చెన్నై కారిడార్ నిధుల ఖర్చు కేంద్ర వాణిజ్య శాఖ భరించనున్నట్లు తెలుస్తోంది. పోలవరం, రాజధాని నిర్మాణానికి 10 వేల కోట్లు, కమర్షియల్ కారిడార్, నౌకాశ్రయాల ఖర్చుపై కీలక ప్రకటన చేసే అవకాశమూ లేకపోలేదు. ఏడు వెనుకబడిన జిల్లాలకు ఆరేళ్ల పాటు రూ.350 కోట్ల నిధుల చొప్పున ప్రకటించే అవకాశముందని సమాచారం. కేంద్రీయ విద్యా సంస్థలకు రూ.2 వేల నుంచి రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra pradesh  special package  special status  arun jaitley  PM modi  suresh prabhu  

Other Articles