అరుణ్ జైట్లీ మీడియా సమావేశం | arun jaitley press conference about AP special package

Arun jaitley press conference about ap special package

Arun Jaitley press conference on AP special package, AP special package, jaitley press conference about special package, Jaitley press conference

Arun Jaitley press conference about AP special package.

ఏపీ ప్యాకేజీపై కాసేపట్లో జైట్లీ ప్రెస్ కాన్ఫరెన్స్

Posted: 09/07/2016 06:54 PM IST
Arun jaitley press conference about ap special package

ఏపీకి ఆర్ధిక ప్యాకేజీపై నెలకొన్న సస్పెన్స్ మరి కాసేపట్లో వీడనుంది. ఈ మేరకు మరికాసేపట్లో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేసే సంకేతాలు అందుతున్నాయి. రాత్రి 8గంటల ప్రాంతంలో నార్త్ బ్లాక్‌లో మీడియా సమావేశం ఏర్పాటుకు రంగం సిద్ధమయ్యింది. ఏపీకి ప్యాకేజీ, నిధి ఎంత మేర ప్రకటిస్తారనే విషయాన్ని వెల్లడించనున్నారు. సుమారు లక్షా యాభై వేల కోట్ల ప్యాకేజీ అందజేయనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.  ఉదయం నుంచి ఎడతెరపని చర్చలు జరుపుతున్న జైట్లీ, చివరి క్షణంలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యేక ప్యాకేజీపై ఈరోజే ప్రకటన చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన మీడియాకు చెప్పడంతో కేంద్రం ఇచ్చే ఆర్ధిక ప్యాకేజీపై అందరి దృష్టి ఉంది. అయితే హోదా ద్వారా వచ్చే అన్ని ప్రయోజనాలను ఏపీకి అందిస్తామని అంటున్నారు. హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం 90 శాతం నిధులు, హోదా లేని రాష్ట్రాలకు 60 శాతం నిధులిస్తున్న సంగతి తెలిసిందే. పోర్టుల అబివృద్ధికి 20 వేల కోట్లు, రాజధాని నిర్మాణానికి 10 నుంచి 15 వేల కోట్లు అందజేసే దిశగా పీఎంవో తుది మెరుగులు దిద్దుతోందని లీకేజీలు అందుతున్నాయి. 

అయితే హోదాతో పాటు ఆ మిగతా 30 శాతం నిధులను ప్యాకేజీలోనే ఇస్తామని చెప్పారు. అమరావతి నిర్మాణానికి ఏటా రూ. 500 కోట్లు.. కేటాయించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఏపీకి 25 విశ్వవిద్యాలయాలను ఇచ్చామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏ విధంగా అన్యాయం జరగబోదని జైట్లీ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో జైట్లీ ప్యాకేజీ ప్రకటనపై ఎంతమేర ఉండబోతుందన్న విషయంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arun Jaitley  special package  AP  press conference  

Other Articles