ప్రేమోన్మాద సాఫ్ట్ వేర్ టెక్కీపై నిర్భయ కేసు.. software engineer booked under nirbhaya case for harrassing colleague

Software engineer booked under nirbhaya case for harrassing colleague

Software engineer bokked under nirbhaya case, porn sites, vijayawada techie murari, dcp palraj, avanigadda techie murari, hyderabad techie murari, nirbhaya case, cc camera, murari, vijayawada, crime

A software engineer who hails from vijayawada is booked under nirbhaya case for harrassing collegue and posting her pic on internet

ప్రేమోన్మాద సాఫ్ట్ వేర్ ఇంజనీరుపై నిర్భయ కేసు..

Posted: 09/07/2016 09:34 AM IST
Software engineer booked under nirbhaya case for harrassing colleague

ఇది మరో రకం ప్రేమోన్మాదం. విద్య, ఉద్యోగం వుండి సమాజంలో మంచి గుర్తింపు పొందిన వారు తెరచాటుగా చేసే ఘోరం. ఇప్పటికే ఇలాంటి చర్యలతో అనేక మంది అబలలు అర్థంతరంగా తమ తనువును బలవంతంగా చాలించుకుంటున్న క్రమంలో ఈ ఉన్మాదం మరింతగా పెరుగుతోంది. విద్య వున్న వింత పశువులు చేసే వికృత చేష్టలపై వనితా లోకం ధైర్యంగా పోరాడాల్సిన సమయం అసన్నమైంది. అందివచ్చిన సాంకేతికతను వక్రమార్గంలో వాడుతూ.. దారుణ ఘటనలకు పాల్పడుతున్న మగమృగాళ్లపై ఉక్కుపాదాన్ని మోపాల్సిన తరుణం వచ్చేసింది.

తన ప్రేమను వ్యక్తం చేసి విఫలమైన, నిరాకరించిందనే అక్కసుతో అమెను వేధించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉన్మాదం తాజాగా వెలుగుచూసింది. తన సహచర ఉద్యోగినిపై కన్నేసిన అతడు ఆమెను లోబరుచుకునేందుకు టెక్నాలజీని ఉపయోగించి చివరకు కటకటాలపాలయ్యాడు. కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం విజయవాడలో డీసీపీ–2 పాల్‌రాజు విలేకరులకు తెలిపారు. కృష్ణా జిలా అవనిగడ్డకు చెందిన మాదివాడ మురారి, విజయవాడ భవానీపురానికి చెందిన యువతి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మురారి ఆమెను పరిచయం చేసుకుని స్నేహితుడిగా నటించాడు. యువతి నివసించే గదిలో రహస్యంగా సీసీ కెమెరాలు అమర్చి అశ్లీల దృశ్యాలను వీడియోలో చిత్రీకరించాడు. ఆ వీడియోలను ఫోర్న్‌ వెబ్‌సైట్‌లో పెట్టి, ఆమె ఫోన్‌ నెంబర్‌ను కూడా జతచేశాడు. దీంతో అమె సెల్ నెంబర్ కు అపరిచితుల నుంచి అనేక కాల్స్ రావడం.. వారందరూ అమెతో అసభ్యంగా మాట్లాడటంతో.. విషయం తెలుసుకున్న యువతి తన తండ్రితో కలసి హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్ నగర పోలీసులు ఆ యువతిని తమ తల్లిదండ్రుల అండతో కేసును నమోదు చేయాలని అందుకు అమె తమ నివాసముండే విజయవాడలో కేసు పెట్టాలని సూచించి అమెను భవానీపురం పోలీస్‌స్టేషన్‌కు పంపారు. ఆమె భవానీపురం పోలీసులకు నిందితుడిపై ఫిర్యాదు చేసింది. పోలీస్‌ కమిషనర్‌ డి.గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాలతో పోలీసులు సోమవారం హైదరాబాద్‌ వెళ్లి మురారిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా యువతి అశ్లీల వీడియోలను తానే నెట్‌లో పెట్టినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Software engineer  nirbhaya case  cc camera  murari  vijayawada  crime  

Other Articles