కొడుకులు లేరన్న అసూయతో పిల్లాడిని బిల్డింగ్ మీద నుంచి విసిరేసింది | Jealous aunt throws infant off hospital roof in Kanpur

Jealous aunt throws infant off hospital roof in kanpur

Jealous aunt throws infant, Kanpur woman throws baby, baby throws from building, baby throws from building, Kanpur woman, throws baby, CC camera baby

Jealous aunt throws infant off hospital roof in Kanpur.

ITEMVIDEOS:బిల్డింగ్ నుంచి పసికందును విసిరేసింది. తర్వాత ఏమైంది?

Posted: 09/07/2016 09:28 AM IST
Jealous aunt throws infant off hospital roof in kanpur

తాను ఒక అమ్మ అన్న విషయాన్ని మరిచి ఓ మహిళ చేసిన పనికి ఇప్పడంతా ఇసడించుకుంటున్నారు. తల్లి తర్వాత తల్లి లాంటి మేనత్త స్థానంలో ఉండి 18 రోజుల పసికందును ఏకంగా మూడు అంతస్థుల బిల్డింగ్ నుంచి కిందకు విసిరేసింది. తప్పుడు పని చేసిందే కాక, ఏమీ తెలియనట్లు తప్పించుకునేందుకు ఫ్లాన్ వేసింది. కానీ, సీసీకెమెరాల రూపంలో పాపం పండటంతో ఊచలు లెక్కిస్తోంది.

వివరాళ్లోకి వెళ్లితే... కాన్పూర్ కి చెందిన సర్వేష్ కుమార్ - అల్కా దంపతులకు ఇటీవలె ఓ బాబుకు జన్మనిచ్చారు. అతనికి అన్మోల్ అనే పేరు పెట్టుకున్నారు. అయితే పుట్టిన తర్వాత ఆ పిల్లాడికి రక్తప్రసరణ సమస్య రావటం ప్రారంభమైంది. దీంతో స్థానికంగా ఉండే ఓ మెటర్నిటీ అండ్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. తర్వాత కాస్త అత్యవసరమైన పని ఉండటంతో ఆ పిల్లవాడి తల్లిదండ్రులు తమ స్వగ్రామానికి వెళ్తూ చిన్నారి బాధ్యతను మేనత్త సరితాదేవికి అప్పగించారు.

అయితే మరుసటిరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో నర్సులను హడావిడిగా పిలిచిన సరితాదేవి.. పిల్లాడు కనిపించడం లేదని చెప్పింది. దీంతో కంగారుపడిన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు వచ్చి గాలించగా ఆస్పత్రికి పక్కనే ఉన్న మరో బ్లాకు నుంచి పిల్లవాడి ఏడుపు వినిపించింది. వెంటనే ఆ ఏడుపును గుర్తించిన పోలీసులు ఓ ఇనుప గ్రిల్ లో ఇరుక్కుని ఆ పిల్లవాడిని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం పరిశీలించిన వైద్యులు ఆ పిల్లాడికి బాగా గాయాలు అయ్యాయని ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుందని చెప్పారు.

 

అయితే విచారణలో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజి చూస్తే.. ఆ పిల్లాడి మేనత్త సరితాదేవి స్వయంగా ఓ టవల్ లో ఆ పిల్లాడిని చుట్టి బయటకు విసిరేసినట్లు కనిపించింది. తమదైన శైలిలో ప్రశ్నించిన పోలీసులకు తర్వాత జరిగినదంతా చెప్పి నేరాన్ని అంగీకరించింది. సరితాదేవికి ముగ్గురు కూతుళ్లు. కొడుకులు లేరు. దీంతో తన సోదరుడికి కొడుకు పుట్టాడన్న అసూయతో.. మరదలికి పుట్టిన కొడుకు (ఈమెకు మేనల్లుడు)ని ఆస్పత్రి పై నుంచి కిందకు విసిరేసిందట. చేసిన పనికి ప్రస్తుతం ఆమెను కటకటాల వెనక్కి నెట్టేశారు. ఆ పిల్లాడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanpur  Aunt  throw baby  CC camera  

Other Articles