విమానయాన ప్రయాణికులకు విస్తారా బంఫర్ అఫర్ Vistara slashes fares to as low as Rs 949-all inclusive

Vistara slashes fares to as low as rs 949 all inclusive

Vistara, Vistara airlines, Vistara bumper offer, Vistara slashes fares, Vistara offer for septmber passengers, vistara discounted routes, vistara domestic services, Vistara domestic fares slashed, Vistara fare war, bumper offer, air travel, Mumbai, Jammu-Srinagar, Delhi, domestic fares

Full service carrier Vistara has slashed fares to as much as Rs 949 (all inclusive) for travel in September. Others are expected to follow.

విమానయాన ప్రయాణికులకు విస్తారా బంఫర్ అఫర్

Posted: 09/06/2016 02:01 PM IST
Vistara slashes fares to as low as rs 949 all inclusive

చౌకధర యుద్దానికి గత కొంత కాలంగా దూరంగా వున్న పలు విమానయాన సంస్థలు కూడా ఇప్పుడు తామున్నామంటూ బంఫర్ అఫర్లతో విమానయాన ప్రయాణికుల ముందుకు రావడంతో అవకాశాలను అందుకునేందుకు కస్టమర్లు కూడా పోటీ పడుతున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సహా పలు ప్రైడేలు విమానయాన సంస్థలు అత్యంత చౌకధరకు విమానయాన అఫర్లను కల్పించగా, తాజాగా అదే దారిలో పయనించేందుకు సిద్దమైన విస్తారా కూడా బంఫర్ అఫర్ తో ముందుకొచ్చింది.

ప్రస్తుత పండగ సీజనులో విమాన ప్రయాణికులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా విమానయాన ప్రయాణికుల ముందుకు వచ్చిన విస్తారా.. తమ కస్టమర్లను కేవలం 949 రూపాయలకే గమ్యస్థానాన్ని చేర్చుతామని కూడా ప్రకటించేసింది. మిగతా కంపెనీలు ఇప్పుడు టికెట్లు కొనుగోలు చేసి, మరో మూడు నెలల తరువాత ప్రయాణ తేదీ ఉండాలని చెబుతున్న వేళ, విస్తారా పన్నులన్నీ కలుపుకుని రూ. 949 ప్రారంభ ధరతో టికెట్లు ఇస్తామని, సెప్టెంబర్ లోనే ప్రయాణాలు పెట్టుకోవాలని ఆకర్షణీయమైన ఆఫర్ ను ఇస్తోంది.

జమ్మూ శ్రీనగర్ సెక్టారులో రూ. 949కు, గోవా - ముంబై మార్గంలో రూ. 1,099కి, ఢిల్లీ - లక్నో మార్గంలో రూ. 1,399కి, గౌహతి - బగ్డోగ్రా మార్గంలో రూ. 1,999కి టికెట్లు ఇస్తామని పేర్కొంది. ఢిల్లీ - బెంగళూరు రూట్లో రూ. 2,399కి, దేశంలోనే అత్యంత బిజీగా ఉండే ఢిల్లీ - ముంబై రూట్లో రూ. 2,299కి టికెట్లను సెప్టెంబర్ 10 వరకూ అందుబాటులో ఉంచుతామని, ఈ నెల 12 నుంచి 30లోగా ప్రయాణించాల్సి వుంటుందని వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vistara  fare war  bumper offer  air travel  Mumbai  Jammu-Srinagar  Delhi  domestic fares  

Other Articles