ఆవాజ్-ఇ-పంజాబ్ పేరిట సిద్దూ కొత్త పార్టీ | Navjot Singh Sidhu forms new front Awaaz-e-Punjab

Navjot singh sidhu forms new front awaaz e punjab

Navjot Singh Sidhu new party, Awaaz-e-Punjab new logo, Awaaz-e-Punjab new party, Awaaz-e-Punjab sidhu, sidhu Awaaz-e-Punjab, Navjot Singh Sidhu new front

Navjot Singh Sidhu forms new front Awaaz-e-Punjab.

9న సిద్దూ కొత్త పార్టీ

Posted: 09/02/2016 04:18 PM IST
Navjot singh sidhu forms new front awaaz e punjab

ఇటీవల ఎంపీ పదవికి, దానిని కట్టబెట్టిన బీజేపీకి గుడ్ బై చెప్పిన నవజ్యోతి సింగ్ సిద్ధూ త్వరలో తనే ఓ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. ఈ నెల 9న ఆవాజ్-ఇ-పంజాబ్ అనే రాజకీయపార్టీని సిద్ధూ ప్రారంభించనున్నట్లు సమాచారం. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు సిద్ధూను తమ పార్టీల్లో చేర్చుకునేందుకు ఆహ్వానం పలికిన విషయం తెలిసిందే. ఏ పార్టీ వైపు సిద్ధూ మొగ్గుచూపుతాడనే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలు జరిగాయి. తాజా ప్రకటనతో ఆయన అభిమానులు, రాజకీయ నేతల్లో నెలకొన్న ఆసక్తికి దీంతో తెరపడినట్లయింది.

రాజకీయాల్లోకి వచ్చిన మాజీ హాకీ క్రీడాకారుడు పర్గత్ సింగ్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు, బెయిన్స్ సోదరులుగా పిలవబడే సిమర్జీత్ సింగ్ బెయిన్స్, బల్వీందర్ సింగ్ బెయిన్స్లతో కలసి సిద్ధు ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన భార్య, బీజేపీ ఎమ్మెల్యే నవ్జ్యోత్ కౌర్ సిద్ధు ధ్రువీకరించారు. ఈ మేర పంజాబ్ మొత్తం బ్యానర్లు కూడా వెలిశాయి.

రాజకీయ నేతల పీచమణిచేందుకే:సిద్దూ

లూథియానాకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యేలు సిమర్జిత్ సింగ్ బైన్స్, బల్వీందర్ సింగ్ బైన్స్ తమతోనే ఉన్నారని, మరెంతో మంది మాజీ ప్రజా ప్రతినిధులు తమ పార్టీలో భాగస్వాములని నవజ్యోత్ సింగ్ సిద్ధూ  తెలిపారు. కొత్త పార్టీ గురించి ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరాలు తెలియజేశారు. పార్టీ విధానాలు, కోర్ కమిటీ తదితర వివరాలను 9వ తేదీ తరువాత తెలియజేస్తామని, సాధ్యమైనంత త్వరగా మ్యానిఫెస్టోతో పాటు పార్టీ తరఫున పోటీ పడే అభ్యర్థుల వివరాలనూ వెల్లడిస్తానని ఆయన అన్నారు. పంజాబ్ కు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ నేతల పీచమణిచేందుకే తాను కొత్త పార్టీని పెడుతున్నట్టు మాజీ క్రికెట్ స్టార్, బీజేపీ పదవికి రాజీనామా చేసిన వ్యాఖ్యానించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Awaaz-e-Punjab  Navjot Singh Sidhu  new party  

Other Articles