Tdp mla bonda umamaheshwara rao posters rock tdp

Tdp mla posters in vijayawada rock tdp cadre on pawan kalyan birthday

pawan kalyan, pawan kalyan birthday, yellow media, bonda umamaheshwara rao, Tdp mla, janasena posters, TDP cadre, splits starts in tdp

Tdp mla bonda umamaheshwara rao posters in few circles of vijayawada on pawan kalyan birthday, rock tdp cadre

టీడీపీలో ప్రకంపనలు.. పవన్ కు ఎమ్మెల్యే జన్మదిన శుభాకాంక్షలు

Posted: 09/02/2016 04:56 PM IST
Tdp mla posters in vijayawada rock tdp cadre on pawan kalyan birthday

సరిగ్గా రెండు రోజుల క్రితం పచ్చ మీడియా రాసిన కామెర్ల వార్తలకు సమాధానం దొరికిందా..? జనసేన పార్టీకి అధ్యక్షుడిగా వున్న పవన్ కల్యాన్ కు వెన్నుదన్నుగా నిలిచింది కేవలం అయన అభిమానులేనని, అయితే అభిమానుల బలంతో ఆయన రానున్న ఎన్నికలలో పోటీచేయడానికి ముందుకు సాగుతున్నారని.. ఇలా అయితే అయన పార్టీ నిలదోక్కుకోవడం కష్టమని పచ్చ మీడియా రాసిన రాతలకు అప్పుడే సమాధానం వచ్చేసింది. ఆంద్రప్రదేశ్ యువత భవితను తాకట్టు పెట్టేంత అభిమానం తనకు ప్రధాని నరేంద్రమోడీపై లేదని చెప్పిన పవన్ వ్యాఖ్యలు నచ్చే.. లేక యువతకు ఆయనిస్తున్న అగ్రతాంబులం ఇచ్చే జనసేనాని చూసో.. కదిలాడు ఓక ప్రజాప్రతినిధి.

ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్లు వున్నా..  తనకు అధికారం వద్దనుకున్నాడో.. ఎలా వచ్చే విమర్శలకు, ప్రశ్నలకు తాను సమాధానం చెబుతాననుకున్నాడో కానీ.. ఏకంగా విజయవాడకు చెందని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు జనసేనకు మద్దతుగా ఫెక్సీలను ఏర్పాటు చేశారు. విజయవాడలోని పలు ప్రముఖ కూడళ్ల వద్ద ఈ ఫ్లెక్సీలు జనసేన కార్యకర్తలను మరింత ఉత్తేజ పరుస్తుండగా, అధికార టీడీపీలో మాత్రం ప్రకంపనలకు కారణంగా మారుతుంది. ఎల్లో మీడియా రాతలకు చెక్ పెడుతుంది.

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నగరంలో ఆయన పెట్టించిన ప్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ గుర్తు, సీఎం చంద్రబాబు నాయుడు ఫొటోలు లేకుండా ప్లెక్సీలు తయారు చేయించారు. పవన్ కళ్యాణ్, తన ఫొటోలు మాత్రమే ప్లెక్సీల్లో ఉండడంతో తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. అధినేత, పార్టీ గుర్తు లేకుండా పవన్ తో తననొక్కడి ఫొటోలు మాత్రమే వేయించుకోవడంతో ఎమ్మెల్యే బొండా వ్యవహారంపై టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు టీడీపీ ఎంపీలు ఏమాత్రం చిత్తశుధ్ధి ప్రదర్శించడం లేదని పవన్ కళ్యాణ్ విమర్శించిన నేపథ్యంలో ఎమ్మెల్యే బొండా ప్లెక్సీలు పెట్టించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles