Complaint filed after camera found in women’s toilet at Mangalore University

Camera found in women s toilet at mangalore university

cell phone in womens toilet, mobile phone in ladies toilet, Tharavathy, lokesh, four member committee, mangalore university, ladies hostel, ladies washroom, cell phone, biosciences block, Konaje police, crime

A student spotted a wooden plank with a hole placed in the ceiling of the women’s toilet in the Biosciences Block of mangalore university

లేడీస్ హాస్టల్ టాయిలెట్లో కూడా..

Posted: 09/02/2016 01:57 PM IST
Camera found in women s toilet at mangalore university

ఆడదాన్ని అంగడి వస్తువుగానే పరిగణించే పురుషాదిక్య సమాజంలో తాజాగా వచ్చిన సాంకేతిక విప్లవం కూడా వారి పట్ల పెద్ద శత్రువుగా మారింది. వాళ్ల పనులలో వాళ్ల నిమగ్నం అవుతుండగా, పోరబాటునో గ్రహపాటునో వారు శరీర అందాలు బయటపడితే చాలు.. దానిని సెల్ పోన్ లో రికార్డు చేస్తూ.. పైశాచిక అనందం పోందుతున్నారు. అయితే ఇలాంటి వీడియోలు వీధుల్లోనో లేక వుమెన్స్ కాలేజ్ కాంపస్ లకు ఎదురుగానే జరగడం సహజం. అయితే ఏకంగా కాలేజ్ క్యాంపస్ లోని లేడీస్ హాస్టల్ కూడా ఇలాంటి ఘటనను చేసుకోవడం దారుణం.

తాజాగా మంగళూరులో జరిగిన ఈ ఘటన ఉన్మాదుల పైశాచిక చర్యలకు సాక్ష్యంగా నిలుస్తోంది. మంగళూరు యూనివర్సిటీలో విద్యార్థినులు కాలకృత్యాలు తీర్చుకునే వాష్‌రూమ్‌లో గత నెల 24న ఊహించని ఘటన జరిగింది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు టాయ్‌లెట్ రూమ్‌కు వెళ్లిన ఓ యువతి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి షాకైంది. వాష్‌రూమ్ రూఫ్‌కు రంధ్రం ఉండటాన్ని గమనించింది. యాజమాన్యానికి ఈ సంగతి తెలియజేసింది. చైర్మన్ వచ్చి పరిశీలించగా... ఆ హోల్‌లో ఓ సెల్‌ఫోన్ దొరికింది. దీంతో యాజమాన్యం, అక్కడున్న విద్యార్థినులు అవాక్కయ్యారు. ఆ ఫోన్‌లో సిమ్ కార్డ్ లేదు.
 
కానీ ఆ సెల్‌ఫోన్‌లో విద్యార్థినుల అసభ్యకర దృశ్యాలు రికార్డయ్యాయి. ఒకటి కాదు... రెండు కాదు ఎంతో మంది యువతులు వాష్‌రూమ్‌లో కాలకృత్యాలు తీర్చుకుంటుండగా గుర్తుతెలియని దుండగులు సన్నివేశాలను చిత్రీకరించారు. యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ సెల్‌‌ఫోన్‌ను సీజ్ చేశారు. సెక్యూరిటీ విషయంలో యాజమాన్యం వైఖరిని విద్యార్థులు తప్పుబడుతున్నారు. ఎవరో వచ్చి లేడీస్ టాయ్‌లెట్స్ దగ్గర వీడియోలు తీస్తున్నా గుర్తించలేని స్థితిలో సెక్యూరిటీ సిబ్బంది ఉండటం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles