jana sena protest over special status for Ap in vijayawada

Janasena activists dharna demanding special status

janasena, pawan kalyan, special status, andhra pradesh, vijayawada, thummalpally, chandbabu naidu, PM Modi, narendra modi, amit shah, special pacakge, special status to AP,

janasena activists conducted a sudden protest over special status for Ap in vijayawada in thummalapally

ప్రత్యేక హోదా కోసం బెజవాడలో జనసేన ధర్నా..

Posted: 09/02/2016 01:07 PM IST
Janasena activists dharna demanding special status

సినీనటుడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ తిరుపతి ప్రస్థాన సభ నిర్వహణ, ప్రసంగంతో అటు కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారుతో పాటు మిత్రపక్షమైన జాతీయ పార్టీ బీజేపిలోనూ కదలికలు మొదలయ్యాయి. పనన్ ప్రస్థానంపై ఇటు రాష్ట్ర అధికార పార్టీ ఎంపీలు, మంత్రులు విమర్శలను ఎక్కుపెట్టి జనసేనానిని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేయగా, అటు కేంద్రం సహా బీజేపి మాత్రం అందుకు భిన్నంగా చర్యలను చేపట్టింది. తమకు అత్యంత సన్నిహితులైన మిత్రులు శత్రువులుగా మారుతున్నారంటూ ఇక ఏపీ విషయంలో జాప్యం చేయకూడదని కూడా నిర్ణయించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి సుజనా చౌదరితో చర్చలు నిర్వహించి.. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించేదిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ప్రత్యేక హోదాతో వచ్చే లాభం కన్నా అధికంగా ప్యాకేజీని రూపోందించాలని నిర్ణయం తీసకున్నా.. అ మేరకు ప్రకటించే అవకాశాలు వున్నాయని తెలిసినా.. ప్రత్యేక హోదా నిరుద్యోగ యువతకు కల్పించే లాభాలను ప్యాకేజీ అందించలేదని జనసేన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. తమకు ప్రత్యేక ప్యాకేజీలు వద్దని, స్సెషల్ స్టేటస్ కల్పిస్తే చాలునని కోరుతున్నారు. ఈ మేరకు డిమాండ్ చేస్తూ వారు కొద్దిసేపటి క్రితం విజయవాడలో ధర్నాకు దిగారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ధర్నాకు దిగిన జనసేన కార్యకర్తలు... ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందేనని పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. ఒక్కసారిగా జనసేన కార్యకర్తలు అక్కడ ప్రత్యక్షం కావడం, ప్రత్యేక హోదా నినాదాలు వినిపించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : janasena  pawan kalyan  special status  andhra pradesh  vijayawada  

Other Articles