pawan kalyan fans questions TG venkatesh on kumbhakarna remark..?

Who slept like kumbakarna for two and half years tg venkatesh

Pawan Kalyan fans questions TDP Mps, TDP mps remarks on pawan kalyan, pawan fans fires on TG venkatesh, pawan fans replies to tdp remarks, pawan kalyan, TG pawan kalyan, TG venkatesh comments on pawan, pawan fan slams tg venkatesh, TG venkatesh pawan kalyan, pawan kalyan fans TG venkatesh

Actor turned politician janasena president pawan kalyan fans question TDP parliament members on their remarks against power star

కుంభకర్ణుడిలా నిద్దరోయింది ఎవరు.. దమ్ముంటే..

Posted: 08/29/2016 05:59 PM IST
Who slept like kumbakarna for two and half years tg venkatesh

నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో గత రెండున్నరేళ్లుగా విఫలమైన టీడీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు నరేంద్రమోడీ, వెంకయ్యనాయుడు సహా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఊరూరా తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేసినప్పుడు ప్రత్యేక హోదాను తీసుకువస్తామని ఎందుకు హామీ ఇచ్చారని పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం తమకే ఓటు వేయాలని ఎందుక ప్రజలను అభ్యర్థించారని నిలదీస్తున్నారు.

కొందరు టీడీపీ పార్లమెంటు సభ్యులు పవన్ కల్యాన్ పై చేస్తున్న విమర్శలు తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేలా వున్నాయని విరుచుకుపడ్డారు. ఎంపీ అవంతి శ్రీనివాస్ పవన్ తిక్క వుంటే తనకు పిచ్చి వుందని వ్యంగంగా వ్యాఖ్యానించడం.. అయన అసమర్థతకు కారణమని అన్నారు. ఇక ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, సహా పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రత్యేక హోదా తీసుకువచ్చే ప్రణాళికను పవన్ బయటపెడితే.. తాము పవన్ వెంట చేరి ఉద్యమిస్తామని, తమకు పదవులు వెంట్రుతో సమానమని అన్నడం.. ప్రత్యేక హోదా విషయంలో అధికార టీడీపీ.. ప్రజలను మోసగించిన తత్వాన్ని బయటపెడుతుందని పవన్ ఫ్యాన్ అన్నారు.

నగదు బదిలీ పథకంలో పాటు అనేక పధకాలను ఇటు రాష్ట్రంతో పాటు అటు కేంద్రంలోనూ వినియోగించేలా చూశామని బడాయిలకు పోతున్న టీడీపీ నేతలు.. తమ పవర్ స్టార్ ప్రణాళికలను ఎందుకు బయటపెట్టాలని అడుగుతున్నారని వారు ప్రశ్నించారు. ఎన్నికలలో ప్రత్యేక హోదా తీసుకువస్తామని హామీ ఇచ్చిన టీడీపీ ఎలాంటి ప్రణాళికలతో అ హామీ ఇచ్చిందో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నేతల నుంచి వస్తున్న ప్రతీ విమర్శకు వారు ఎలా సమాధానం ఇచ్చేరో మీరే చదవండీ.

అవంతి శ్రీనివాస్: పవన్ తిక్కమో నాకు పిచ్చి..
పవన్ ఫ్యాన్స్: సినీమా రైటర్ గా సెటిలవ్వకు రాజకీయాలకు ఎందుకోచ్చావు సారూ..? ఇక మరికోందరు జనసేన కార్యకర్తలు ఇక్కడ వైజాగ్ లో లేదా అక్కడ ఎర్రగడ్డలో డాక్టర్లు చూపించకపోయావా..

టీజీ వెంకటేష్: కుంభకర్ణుడిలా పడుకుని ఇప్పడు ప్రత్యేక హోదా అడుగుతున్నావా..?
ఫవన్ ఫ్యాన్: ప్రత్యేక హోదా కోసం తిరుపతికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త మునికోటి ఆత్మహత్యతో ప్రారంభమైన బలిదానాలు.. పెరుగుతూ పోతుండగా, మీ ప్రభుత్వం ఏం చేప్పింది. ప్రధాని, అర్ధికశాఖ నుంచి నీటి అయోగ్ కు సమస్య బదిలీ అయ్యింది. అక్కడి నుండి కూడా ప్రత్యేక హోదా రాదని స్పష్టమైనా.. టీడీపీ నేతలు చేసిందేమిటి..? కుంభకర్ణుడిలా నిద్రపోవడం తప్ప. మునికోటి అత్మహత్యకు పాల్పడి ఏడాదినోక్క మాసం అవుతున్నా మొద్ద నిద్ర వీడనిది ఎవరు..?

జనపేన కార్యకర్తలు: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపి రాజ్యసభలో తీసుకోచ్చిన ప్రైవేటు బిల్లుపై ఒక వైపు తెలుగు రాష్ట్రాల ప్రజలు అసక్తిగా గమనిస్తుండగా, తన పార్టీకి చెందిన సహచర రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మంత్రి బిల్లుపై చర్చ వాయిదా పడిన సందర్భంగా బల్లలు చర్చినప్పుడు.. ఎవరు కుంభకర్ణుడిలా నిద్రపోయారు.. టీజీ గారు..? ఎన్నికల సందర్భంలో ప్రత్యేక హోదా తీసుకోస్తామని రాష్ట్ర ప్రజలను నిట్టనిలువునా మోసం చేసింది ఎవరు..? రెండున్నరేళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు హోదా తీసుకురాలేకపోయింది ఎవరు..? హోదా విషయంలో కుంభకర్ణుడి నిద్ర ఎవరిది టీజీ గారు..?

టీజీ వెంకటేష్: ఇక్కడైతే చెల్లింది కానీ అక్కడైతేనా..
పవన్ ఫ్యాన్స్: మూడేళ్ల క్రితం రాష్ట్ర పునర్విభజన సమయంలో రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోతే.. మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతుందని బూచిని చూపినట్లు ఇక్కడ కాబట్టి చెల్లింది.. అక్కడైతే కాళ్లు చేతులు విరగోట్టి జైళ్లో పడేస్తారని భయాన్ని కల్పిద్దామనుకుంటున్నారా..? అలా చేసినందుకు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిపై దేశ సర్వన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసిన విషయం తెలియదా..? ఇది జరగి కూడా వారం రోజులు కావస్తున్నా.. కుంభకర్ణుడిలా నిద్రపోయే వారికి ఎలా తెలుస్తుంది..? ఇలా ఎన్ని సార్లు ఎంత మందికి బూచీ చూపెడుతున్నారో.. అందుకే కేంద్రం మీకు హోదా విషయంలో బూచీ చూపుతుంది.

జనసేన కార్యకర్తలు: ఎన్నికల సమయంలో గెలుపోటముల మధ్య ఊగిసలాడుతున్న సమయంలో స్వయంగా వచ్చి ప్రచారం చేయాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబు కోరినందుకు కాళ్లు చేతులు విరగ్గోట్టి జైలులో వేస్తారా..? అప్పుడే పుట్టిన శిశువు కళ్లు తెరసీ తెరవక ముందే తీసుకెళ్లి ఎన్నికల ప్రచారంతో అధికారంలోకి తీసుకువచ్చిన తమ పార్టీని విమర్శించే హక్కు టీడీపీకి లేదు. టీడీపీ పార్టీకి ఓట్లు వేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో విస్తృత ప్రచారం చేసి కేవలం ఆరు లక్షల ఓట్లతో టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చినందుకు కాళ్లు చేతులు విరగ్గొట్టి జైలులో పెడతారా..?. రేవు దాటే వరకు ఓడ మల్లన్న,. రేవు దాటగానే బోడ మల్లన్న అన్నట్లు.. అధికారంలోకి వచ్చేంత వరకు మా మిత్రపక్ష సభ్యుడు అని తప్పులెత్తి చూపగానే జైలు గోడలు గుర్తుకు వస్తున్నాయా..? దీంతో టీడీపీ అసలు నైజం బయటపడింది కదూ టీజీ గారు. అసలు ప్రత్యేక హోదా డిమాండ్ ను మొదటి సారిగా లేవనెత్తిందే తానని చెప్పుకొచ్చిన బడాయి బాబు.. పదవి రాగానే ఏవీ గుర్తుకు రావన్నది రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు కదా టీజీ గారు.

దొరక్క దొరక్క మీకు తమిళనాడు రాష్ట్రమే దొరికిందా.. టీజీ గారు. అక్కడ అధికార, విపక్షాల మధ్య వర్షంలోనూ రావణ కాష్టంలా నిప్పు రగిలేంత వైర్యం వున్నా.. వారి రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంలోనైనా వారు ఒక్కటవుతారు. అందరూ ఐక్యంగా కలసి పోరాడకపోయినా.. లక్ష్య సాధనకు మాత్రం ఐక్యత చూపుతారు. తమిళ బాషకు ప్రాచీన హోదా కల్పించే అంశంలో వారి ఐక్యత గమనించకుండా నిద్రపోయారా టీజీ గారూ..? మరి వారిలో ఉన్న ఐక్యత మన ఎంపీల విషయంలో లేదని, అ దీక్ష, పట్టుదల లేవని, అందుచేతనే ప్రత్యేక హోదా రాలేదని నిజాన్ని చెబితే విమర్శిస్తారా.? వారిలా ఐక్యంగా ఉద్యమించాలని, పోరాటం చేస్తే పోయేదేమీ లేదని అంటే ఇక్కడైతే చెల్లింది కానీ అక్కడయ్యివుంటేనా.. అన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఇక్కడ ఎంపీలు కాబట్టి చెల్లుతుంది కానీ.. అక్కడి ఎంపీలు అయ్యివుంటేనా.. ?

విజయవాడ ఎంపి కేశినేని నాని: ప్రధాని లాంటి పెద్దలను గౌరవించేందుకు సార్ అంటున్నాం.. తెలుగు ప్రజలకు అర్థంకావాలి కాబట్టి తెలుగులో మాట్లాడతానే తప్ప, తనకు ఇంగ్లీష్, హిందీ రాదంటారా..?
పవన్ ఫ్యాన్స్ : పెద్దలకు గౌరవించడం మన సంప్రదాయం అని తెలుసుకున్న కేశినేని నాని.. వయస్సుతో పాటు హోదాకు కూడా గౌరవం ఇవ్వాలన్న విషయం తెలియదా.? తమ పార్టీని గత ఎన్నికలలో అధికారంలోకి తీసుకువచ్చిన పవర్ స్టార్ కు పార్టీ ఎంపీలుగా గెలిచిన మీరు ఎందుకు గౌరవం ఇవ్వడం లేదు. తప్పలెత్తి చూపితే.. గౌరవం కాస్తా గంగపాలు చేస్తారా..? అదే మీ కపట రాజనీతి అయితే మరీ నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బీజేపికి చెందిన కేంద్ర మంత్రులు, కిరణ్ రిజుజ్జు, రాజ్ నాథ్ సింగ్, అర్థిక మంత్రి అరుణ్ జైట్టీ, నీటీ అయోగ్ అందరూ కాదని తేల్చిచెప్పిన నేపథ్యంలో వారిని కూడా విమర్శిస్తారా..?

జనసేన కార్యకర్తలు: బీజేపితో పోత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చి.. ఆ తరువాత ప్రతిపక్ష హోదాలో పదేళ్ల పాటు వున్న సమయంలో మీ అధినేత చంద్రబాబు బీజేపి పెద్దలకు ఇచ్చిన గౌరవం గురించి తెలుగు ప్రజలందరకీ తెలుసు. బీజేపీతో పోత్తు పెట్టుకుని చారిత్రక తప్పిందం చేశామని వ్యాఖ్యానించింది మీ అధినేత కాదా..? గౌరవం అంటే అధికారంలో ఉన్నప్పుడే అందుకునేదని మీ ద్వందనీతిని బయటపెట్టకండీ. ఇక తెలుగులో మాట్లాడేది తెలుగు ప్రజలకు తెలిసేందుకే అని అనడం కూడా విడ్డూరమే. రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో అనాడు పార్లమెంటులో ఏం జరిగిందన్నది తెలుగు ప్రజలకు పూర్తిగా పూసగుచ్చినట్లుగా అర్థమైంది. అయితే మరి ఆ రోజున పార్లమెంటులో ఏ ఒక్కరు కూడా తెలుగులో మాట్లాడలేదు సుమీ. కానీ అర్థమైంది.. రాత్రికి రాత్రే అందోళన పర్వాలు కూడా దిగిన విషయం మర్చపోయినట్లు వున్నారు. తెలుగుపై అంత ప్రేమ వుంటూ ముందుగా మీ బస్సులపై అంగ్ల పదాలకు బదులు తెలుగు పదాలతో రాయించండీ.

హోదాను తక్షణం తీసుకువచ్చేలా పవన్ వద్ద వ్యూహం ఉంటే వెంటనే దానిని బయటపెట్టాలని కేశినేని నాని అనడం కూడా విడ్డూరంగా వుంది. ఏ వ్యూహం లేకుండానే.. ఎలాంటి ప్రణాళికలు రచించకుండానే, మీరు ప్రత్యేక హోదా తీసుకువస్తామని ఎన్నికల హామీని ఎలా ఇచ్చారు.? గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరు నేతలు ప్రత్యేక హోదా తీసుకువస్తామని ఎలా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు..? రాష్ట్ర పునర్విభజన చేసిన సమయంలో ప్రజల అగ్రహావేశాలను మరింత ఉసిగోల్పి.. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ప్రత్యేక హోదా కావాలని.. దానిని తాము మాత్రమే తీసుకురాగలమని నమ్మబలికింది మీ పార్టీ కాదా.? ఎలాంటి వ్యూహాలు లేకుండా, ప్రణాళికలు రచించకుండా అది సంజీవని అని పేర్కోని దాని పేరుతో ఓట్లను గుమ్మరించుకుని ప్రజలను మోసం చేసింది మీరు కాదా..? ప్రణాళికలే వుంటే గత రెండేన్నరేళ్లుగా ఎంచేస్తున్నారు. ప్రవేటు బిల్లులకు తమ మద్దతును ఇవ్వలేని దయనీయ స్థితిలో మీ పార్టీ ఎంపీలు వున్నారన్నది నిజం కాదా.. బిల్లు వాయిదా పడిన నేపథ్యంలో కేంద్రమంత్రి సుజనా బల్లలు చరిచింది వాస్తవం కాదా...?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Pawan kalyan  powerstar fans  janasena workers  TG venkatesh  TDP MPs  special status  

Other Articles