How did you earn Rs 474 Crores? Undavalli questions Narayana

After ramoji rao undavalli arun kumar now targets minister p narayana

Undavalli arun kumar, former congress mp, Eenadu group chairman. Ramoji Rao, AP Municipal Minister, P Narayana, Rs 474 crore. 'narayana group of schools, narayana junior collages

After Eenadu group chairman Ramoji Rao, now Former Congress MP Undavalli Arun Kumar targets minister narayan, questioning how did he amassed a wealth of Rs 474 crore.

నారాయణా.. ఈ కోట్ల రూపాయల అస్తుల చిట్టా విప్పుమా..?

Posted: 08/29/2016 07:24 PM IST
After ramoji rao undavalli arun kumar now targets minister p narayana

రాష్ట్ర మంత్రి నారాయణ ఆస్తుల చిట్టాను విప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. తనకు సొంతంగా రూ. 474 కోట్ల ఆస్తులు ఉన్నట్లు స్వయంగా నారాయణ ప్రకటించారని, ఆ డబ్బు ఎలా సంపాదించారో బయటపెట్టాలని నిలదీశారు. తాను ప్రకటించిన రూ. 474 కోట్ల ఆస్తులు ఎక్కడినుంచి వచ్చాయో నారాయణ చెప్పాలని డిమాండ్ చేశారు. దానికి ముందుగా అకౌంటు చెప్పాలన్నారు. ముఖ్యమంత్రికి కుడి, ఎడమ చేతులు మీరేనని అంతా అంటారని, ఆ లెక్కన అమరావతి స్కాంకు కూడా సూత్రధారి నారాయణే అవుతారని ఉండవల్లి ఆరోపించారు.

పది పదిహేను రోజుల్లోగా నారాయణ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే తాను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని ఆయన అన్నారు. చట్టప్రకారం ఏదైనా విషయం తెలిసి అధికారులకు చెప్పకపోవడం కూడా శిక్షార్హమే అవుతుందన్నారు. పారదర్శకంగా ఉన్నట్లు చెబుతూ ఉంటారని, పార పట్టుకుని తిరగడమే పారదర్శకతా అని ప్రశ్నించారు. మనం ఏదైనా శుభకార్యం ప్రారంభిస్తే 'నారాయణ' అంటూ ప్రారంభిస్తాం కాబట్టి, ఈ ఆస్తుల వివరాలు వెల్లడించడం కూడా నారాయణే మొదలుపెట్టాలని అన్నారు.

తప్పుడు మనుషులు నడిపే స్కూళ్లకు ఎవరూ పిల్లలను పంపరని, అందువల్ల ఆయన తన క్రెడిబులిటీని నిరూపించుకోవాలని చెప్పారు. ఏ వ్యాపారం చేసి ఇంత మొత్తం సంపాదించారో చెప్పాలన్నారు. తాను డాక్యుమెంట్ల ఆధారంగానే అన్నీ చెప్పానని.. మీ వ్యాపారాలేంటో, వాటికి ఆధారాలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. సొసైటీలకు వేల కోట్ల నిధులు ఉండొచ్చు గానీ, ఆ సొసైటీలను నడిపేవారికి వేలకోట్లు ఉండటానికి వీలుండదని అన్నారు. వీళ్లంతా సొసైటీ డబ్బులను సొంత డబ్బులా వాడేసుకుంటున్నారని తెలిపారు. సొసైట చట్ట ప్రకారం లాభాపేక్ష లేకుండా విద్యాసంస్థలు నడపాలని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruthi Haasan  tamanna  vishal  Kathi Sandai  okkadochadu  kollywood  

Other Articles