ChampOne C1 smartphone with fingerprint sensor, 2GB RAM, to sell at Rs. 501

Champone c1 phone at rs 501

champone c1 rs 501, champone c1, champone c1 price, champone, rs 501 smartphone, champone c1 features, champone c1 specifications, docoss, freedom 251, namotel acche din, smartphones, technology, technology news

ChampOne is unheard of and is claiming to offer a new ChampOne 1C smartphone at Rs 501.

కారు చౌకగా చాంఫ్ వన్ స్మార్ట్ ఫోన్.. మంచి తరుణం మించిన దొరకదు..

Posted: 08/29/2016 01:19 PM IST
Champone c1 phone at rs 501

టెలి కమ్యూనికేషన్స్ రంగంలో రిలయన్స్ తీసుకోచ్చిన మార్పుతో అప్పటి వరకు కేవలం సంపన్నులకు మాత్రమే స్టేటస్ సింబల్ గా మారిని మొటైల్ ఫోన్లు.. అప్పటి నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చాయి. అలానే రింగింగ్ బెల్స్ సంస్థ నుంచి పర్వాలేదని యావరేజ్ టాక్ సోంతం చేసుకున్న ఫ్రీడమ్ 251 ఫోన్లుతో స్మార్ట్ ఫోన్ల దరలలో కూడా అలాంటి మార్పులే కనిపించనున్నాయి. 5 అంగుళాల ఐపీఎస్ డిస్ప్లే, 16 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్, 8 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ,  1.3 గిగాహెడ్జ్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, డ్యుయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లతో మార్కెట్లో అందుబాటులో వున్న ఫోన్ ధరలకు ఈ ఫోన్ కు ఎంతో వత్యాసం వుంది.

ఇన్ని ఫీచర్లతో అందుబాటులో వున్న ఫోన్ ధరలు సుమారుగా 6500 రూపాయల ధర పలుకుతుండగా, ఎన్నడూ పెరు వినని కంపెనీ మాత్రం దానికి కేవలం 500 రూపాయలకే అందిస్తానని ప్రకటించింది. అదే చాంప్వన్ కంపెనీ. ఈ కంపెనీ ఉన్నట్టు భారతీయులకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా అ కంపెనీ గురించి అన్వేషణ ప్రారంభమైంది. కారు చౌకగా ఏది వస్తుందన్న దానిని వదులుకునేందుకు ఇష్టపడని హ్యూమన్ సైకాలజీ.. గాలం వేసినట్లు ఈ కంపెనీ కేవలం 501 రూపాయలకే స్మార్ట్ఫోన్ అందించనుందని ప్రకటించింది

బడాబడా స్మార్ట్ఫోన్ కంపెనీలకు షాకిస్తూ..  251 రూపాయలకే స్మార్ట్ఫోన్ అందిస్తామంటూ వెల్లడించిన రిగ్గింగ్ బెల్స్కు  పోటీగా... ఈ కంపెనీ స్మార్ట్ఫోన్ల మార్కెట్లోకి తీసుకురానుందట. మిడ్ రేంజ్ మార్కెట్లో ఆఫర్ చేసే స్మార్ట్ఫోన్ల కంటే మెరుగైన ఫీచర్లతో వినియోగదారులు ముందుకు కొత్త స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకువచ్చినట్టు చాంప్వన్ వెల్లడించింది.  చాంప్వన్ సీ1 ఫోన్ను తన సైట్ చాంప్వన్ఇండియా.కామ్లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొంది.

సెప్టెంబర్ 2 నుంచి ఫ్లాష్ అమ్మకాలు చేపడతామన్న కంపెనీ, వెబ్సైట్లో ముందస్తు రిజిస్ట్రేషన్ల ద్వారా ఫోన్ను అందించనున్నట్టు తెలిపింది. కాగా ఈ ఫోన్ అసుల ధర మాత్రం రూపాయలు 7 వేల 999 గా వుండగా, ప్లాష్ సేల్ లో మాత్రమే దీనిని రూ. 501 అందిస్తున్నామని తెలిపింది. అయితే సాంకేతిక సమస్యలతో ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు క్లోజ్ అయ్యాయని, సాంకేతిక సమస్య పరిష్కారం అనంతరం కొత్త రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. క్యాష్ ఆన్ డెలివరీలో ఈ ఫోన్ను చాంప్వన్ విక్రయించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ChampOne  ChampOne C1 phone  Rs 501 smart phone  technology  

Other Articles