పరారీలో ఉన్న నిందితురాలిని పట్టించిన ఫోటో | Sydney teen Amy Sharp requests better photo after alleged escape

Sydney teen amy sharp requests better photo after alleged escape

Sydney teen Amy Sharp, Sydney teen requests better photo, requests better photo arrested, Sydney teen Amy Sharp arrested, escaped girl arrested after beautiful pic

Sydney teen Amy Sharp requests better photo after alleged escape.

అందమైన ఫోటో పెట్టి అరెస్టయ్యింది

Posted: 08/29/2016 02:45 PM IST
Sydney teen amy sharp requests better photo after alleged escape

పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు చేసే ప్రయత్నాలు ఒక్కోసారి విచిత్రమైన అనుభవాలను అందిస్తాయి. సరిగ్గా ఆస్ర్టేలియాలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. పరారీలో ఉన్న నిందితురాలిని పట్టుకునేందుకు ఓ ఫోటో ఉంచగా, అందమైన ఫోటో పెట్టొచ్చుగా అంటూ అంతే ఫాస్ట్ గా రిప్లై ఇచ్చి నిందితురాలు దొరికిపోయింది.

వివరాళ్లోకి వెళ్లితే.. 18 ఏళ్ల అమీ షార్ప్ ను ఆస్తి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తెలివిగా జైలు నుంచి తప్పించుకున్న గత కొంత కాలంగా ఎవరికీ చిక్కకుండా తిరుగుతోంది. దీంతో లాభం లేదనుకున్న పోలీసులు చివరికి ఆమె రెండు ఫోటోలను నెట్ లో ఉంచి పట్టించిన వారికి నజరానా ప్రకటించింది. తను ఫోటోలో అసహ్యాంగా చూపించడంపై అమీ ‘షార్ప్’ గానే రియాక్ట్ అయ్యింది. తనను మరింత గ్లామర్ గా చూపించాలంటూ కొన్ని చిత్రాలను మీడియాకు పంపింది.

"మీరు దయచేసి నేను పంపుతున్న ఈ ఫోటోలు వాడతారా? థ్యాంక్యూ. నన్ను కాస్త అందంగా చూపే చిత్రాలు వాడండి" అంటూ పంపి విన్నవించుకుంది. దాదాపు 47 వేల మంది ఆమె పోస్టింగ్ పై స్పందించారు. కాగా, చిత్రాలను పోస్ట్ చేసిన ఐపీ అడ్రస్ ఆధారంగా విచారించిన పోలీసులు అమీని అరెస్ట్ చేశారు. ఆమె వల్ల ప్రజలకు ఎలాంటి రిస్క్ లేదని, కేవలం ఆస్తి కేసులోనే ఆమెను కస్టడీలోకి తీసుకున్నామని వెల్లడించారు. వికారంగా కనిపించే పోటోలను చూపించి కూడా నిందితులను బయటకు రప్పించవచ్చని మెల్ బోర్న్ పోలీసులు నిరూపించారంటూ నెట్టింట సెటైర్లు వస్తున్నాయి.

Sydney teen Amy Sharp arrest

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sydney teen  Amy Sharp  escape  arrested  photo  

Other Articles