HC quashes Rs 2cr cheating case against Sussanne Khan

Bombay high court quashes fir against sussanne khan

sussanne khan, sussanne khan fir, sussanne roshan fir, bombay high court sussanne khan, sussanne khan charcoal project, suzanne khan, bombay hc sussanne khan, sussanne khan interior designer, case against sussanne khan

Real estate firm Emgee Enterprises had alleged that Sussanne Khan failed to deliver a project within the period stipulated in the contract.

న్యాయవ్యవస్థకు బాలీవుడ్ హీరో మాజీ భార్య ధన్యవాదాలు..

Posted: 08/26/2016 11:17 AM IST
Bombay high court quashes fir against sussanne khan

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. రెండు నెలల క్రితం ఆమెపై దాఖలైన చీటింగ్ కేసును బాంబే హైకోర్టు గోవా బెంచ్ కొట్టివేసింది. తన గౌరవాన్ని చెడగొట్టేందుకే ఛీటింగ్ కేసు పెట్టారని, దీంతో తనను భయపెట్టాలన్న ఉద్దేశం వారిలో స్పష్టంగా కనబడుతుందని గత వారం క్రితం అరోపించిన అమెకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది.

రూ. 1.87 కోట్లకు సుసానే ఖాన్ తమను మోసం చేసిందని ఎంజీ ప్రాపర్టీస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ గోవాలో ఛీటింగ్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల స్పందించిన అమె ఇలాంటి కేసులకు బెదిరేది లేదని చెప్పారు. కాంట్రాక్టు రద్దు చేసినందుకు తనకే డబ్బులు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. తనకు రావాల్సిన డబ్బుల గురించి అడిగినందుకే తనపై కేసు పెట్టారని సుసానే ఖాన్ ఆరోపించారు. ఒత్తిడికి గురి చేసి రాజీ రావాలన్న కుట్రతోనే ఇదంతా చేశారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.

కాగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం సుసానే ఖాన్ కు ఊరటనిచ్చింది. ఆమె మోసానికి పాల్పడినట్టు ఎఫ్ఐఆర్ లో ఎక్కడా నమోదు కాలేదని కోర్టు తెలిపినట్టు సుసానే ఖాన్ తరపు న్యాయవాదులు నితిన్ సర్వేశాయ్, హితేశ్ జైన్ వెల్లడించారు. ఎఫ్‌ఐఆర్ లో ఆమెకు వ్యతిరేకంగా ఎటువంటి అభియోగాలు నమోదుకానప్పుడు కేసు నిలవదని న్యాయస్థానం అభిప్రాయపడిందని తెలిపారు. సివిల్ కేసును పోలీసు యంత్రాంగం అండతో క్రిమినల్ కేసుగా మార్చాలని పిటిషన్లు ప్రయత్నించారని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sussanne khan  bombay high court  emgee enterprises  civil case  charcoal project  

Other Articles