పరువు హత్యకు ముందు సోనీ ఏం చెప్పింది | Murdered Soni filming about her life threat just before days honour killing.

Murdered soni filming about her life threat just before days

Honour killing in Uttar Pradesh, Murdered Soni, Soni Honour killing, Honour killing video, Video just before days honour killing, soni murder, Honour Killing in Harthas

Murdered Soni filming about her life threat just before days honour killing.

ITEMVIDEOS:హత్యకు ముందు సోనీ ఏం చెప్పింది

Posted: 08/26/2016 11:11 AM IST
Murdered soni filming about her life threat just before days

ఉత్తరప్రదేశ్ లో దారుణంగా పరువు హత్యకు గురైన 26 ఏళ్ల సోనీ యువతి వీడియో ఇప్పుడు నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. గురువారం ఆ యువతి హత్యకు గురికాగా, చనిపోయే ముందు కొద్దిరోజుల ముందు ఆ వీడియో తన ప్రాణ హాని గురించి ఆ యువతి చెప్పటం ఉంది.

నా పేరు సోనీ. నా కుటుంబం నన్ను చంపాలని చూస్తోంది. ఇమ్రాన్ అనే యువకుడిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా... కానీ, నా కుటుంబ సభ్యులు నన్ను నా గ్రామానికి తీసుకెళ్తున్నారు. నా తండ్రి సోదరులు నన్ను చంపాలనుకుంటున్నారు అంటూ మొబైల్ ఫ్రంట్ కెమెరాలో ఆ యువతి వీడియో తీసుకుంది. రైలులో బాత్ రూంలో ఆమె ఈ సందేశాన్ని రికార్డు చేసింది.

 

నాకేదన్నా జరిగితే దానికి నా కుటుంబానిదే బాధ్యత అంటూ వరుసగా పేర్లు చెప్పుకొచ్చింది. ఆపై ఆమె ఆ వీడియోను నెట్ లో అప్ లోడ్ చేయగా, రాష్ట్రం మొత్తం వైరల్ అయిపోయింది. అయితే వీడియో చూసి పోలీసులు అప్రమత్తం అయ్యేలోపే ఆమె హత్యకు గురైంది.

స్వగ్రామం హత్ రాస్ లోని ఆమె ఇంట్లో శవంగా పడి ఉంది. కుటుంబంలోని ఆరుగురు సభ్యులు పరారీలో ఉన్నారు. వారి గురించి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. మరోవైపు ఆమె ప్రియుడు ఇమ్రాన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని కూడా ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP  Harthas  Honour Killing  Soni  video  

Other Articles