railway budget merged into general budget.. no train sound in parliament

No rail budget from next fiscal to merge it with union budget

Arun Jaitley, Finance minister, General Budget, Gopal Mishra, PM, Rail budget, Rail projects, Railway Budget, Union Budget, Indian Railways, railway budget, financial budget, Budget, merger

The 92-year-old practice of presenting a separate Rail Budget is set to come to an end from the next fiscal, with the Finance Ministry accepting Railway Minister Suresh Prabhu’s proposal to merge it with the General Budget.

రైలు కూతకు మంగళం.. ఇక అంతా సాధారణం..

Posted: 08/16/2016 11:28 AM IST
No rail budget from next fiscal to merge it with union budget

భారతీయ రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్ కేంద్రం మంగళం పాడునుంది. స్వాతంత్ర్యానికి ముందు నుంచి అమలువుతున్న విధానానికి చెక్ పడనుంది. రానున్న అర్థిక సంవత్సరం నుంచి పార్లమెంటులో రైలు కూత వినపించకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. అయితే రైల్వే శాఖ చేస్తున్న అభివృద్ది పనులు, కోత్త లైన్లు, కోత్త ప్రాజెక్టుల వివరాలన్నింటికీ మాత్రం పార్లమెంటులో సభ్యులు ముందు వుంచుతారు. అయితే ప్రత్యేక బడ్జెట్ లో కాకుండా సాధారణ బడ్జెట్ లోనే వీటిని కూడా పోందుపర్చనున్నారు.

సాధారణ బడ్జెట్‌లో రైల్వేలను చేర్చడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకరించడంతో ఇక రైల్వే ప్రత్యేక బడ్జెట్ కు కేంద్రం తిలోదకాలు ఇవ్వనుంది. దీంతో 1924 నుంచి అమలవుతున్న విధానానికి 2017లో తెరపడబోతోంది. సాధారణ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ను కలిపేందుకు అనుసరించవలసిన మార్గదర్శకాలను రూపొందించేందుకు ఐదుగురు అధికారులతో కమిటీని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నియమించినట్లు సమాచారం. 1996 నుంచి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతుండటంతో రైల్వే మంత్రులు తమ సొంత ప్రతిష్ఠను పెంచుకోవడానికి, తమ రాష్ట్రాలకు తాయిలాలు ఇచ్చుకోవడానికి కృషి చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
 
రైల్వే మంత్రులుగా రాష్ట్రాల్లో బలంగా ఉండే పార్టీల నేతలు పనిచేయడంతో ఆ పదవిని రాజకీయ ప్రయోజనాలకే వాడుకున్నారనే విమర్శలు ఉన్నాయి. రైల్వే బ్యూరోక్రసీ కూడా గుదిబండగానే మారింది. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో రైల్వే మంత్రి పదవిని బీజేపీ నేత సురేశ్ ప్రభు నిర్వహిస్తున్నారు. అయితే గత రైల్వే మంత్రులకు భిన్నంగా సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, కీర్తిప్రతిష్ఠలు పొందడంపై దృష్టి పెట్టకుండా, దానిని ఆర్థిక శాఖకు అప్పగించడానికి మొగ్గు చూపారు. దాంతోపాటు బీజేపీకి లోక్‌సభలో తగినంత ఆధిక్యత ఉండటం కూడా కలిసొచ్చింది.

రైల్వే బడ్జెట్‌ను రద్దు చేయాలని నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ దేవ్రాయ్, కిశోర్ దేశాయ్‌ కమిటీ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో ఈ విషయమై రాజ్యసభలో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ, రైల్వేల దీర్ఘకాలిక భవిష్యత్తులను దృష్టిలో ఉంచుకొని సాధారణ బడ్జెట్‌లో రైల్వేలను కలిపేయాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరినట్లు తెలిపారు. ఈ విలీన ప్రక్రియ కాల పరిమితి గురించి ఆయన చెప్పలేదు. సాధారణ బడ్జెట్‌లో రైల్వేలను కలిపేయడం వల్ల రైల్వేలు ప్రభుత్వంలోని ఇతర శాఖలతో సమానమవుతాయి. బడ్జెట్ సహకారం లభిస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణ కూడా ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Railways  railway budget  financial budget  Arun jaitley  suresh prabhu  Budget  merger  

Other Articles