Freedom 251: Good, basic-level smartphone for the masses

Ringing bells starts deliveries of 65000 freedom 251 smartphones

Ringing Bells, Ringing Bells Freedom 251, Freedom 251, Freedom 251 review, Freedom 251 delivery, Freedom 251 price, Freedom 251 specifications, Freedom 251 features

Noida-based startup Ringing Bells Pvt Ltd has done the impossible. After months of bickering and bad press, the less than $4 "Freedom 251" smartphone has finally started reaching people.

డమ్మారే.. డమ్ డమ్.. గుడ్ టాక్ సొంతం చేసుకున్న ఫ్రీడమ్..

Posted: 08/16/2016 11:12 AM IST
Ringing bells starts deliveries of 65000 freedom 251 smartphones

యావత్ ప్రపంచదేశ స్మార్ట్ ఫోన్ ప్రయిులను అశ్చర్యానికి గురిచేసిన సంచలనం రేపిన రింగింగ్ బెల్స్ సంస్థ నుంచి విడుదలైన నూతన ఉత్పాదన ఫ్రీడమ్ స్మార్ట్ ఫోన్ లో ఏముందో, ఎలా పనిచేస్తోందో అనే ఆసక్తి అందరికీ ఉంటుంది కదూ. అయితే 251 రూపాయలలో లభించే ఫోనులో అత్యాధునిక సాంకేతికతను కోరుకోవడం కూడా పోరబాటేనని ఎందోరో అంటున్నా.. మార్కెట్లో లభించే స్మార్ట్ ఫోన్లు, వాటి ధరలతో సరిపోల్చుకున్న నేపథ్యంలో ఫ్రిడమ్ ఫోన్లు గుడ్ టాక్ సోంతం చేసుకన్నాయి.

ఇప్పటికే దాదాపు 6 వేల ఫోన్లను డెలివరీ చేశారు కాబట్టి వాటి పనితీరు ఎలా ఉందన్న విశ్లేషణలు నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. ఇందులో ఆండ్రాయిడ్ 5.1 వెర్షన్ ఉంది. 4 అంగుళాల డిస్ప్లే, 3.2 మెగాపిక్సెల్ వెనక కెమెరా, 0.3 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ప్రస్తుతం అంతా 13 మెగాపిక్సెళ్ల వెనక కెమెరా, 5 మెగాపిక్సెల్ వరకు ఫ్రంట్ కెమెరాల యుగం నడుస్తుండటంతో.. కెమెరా విషయంలో కొంత అసంతృప్తి తప్పదు. కానీ, ఫోన్ మాత్రం బాగానే పనిచేస్తోంది.

ఇందులో 1 జీబీ ర్యామ్ ఉంది, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది. ఇంటర్నల్ స్టోరేజికి 8 జిబి స్పేస్ ఇచ్చారు. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 32 జీబీ వరకు సపోర్ట్ చేస్తుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 1450 ఎంఏహెచ్. వై-ఫై, బ్లూటూత్, ఎఫ్ఎం రేడియో లాంటి సదుపాయాలన్నీ ఉన్నాయి. ఫోనుకు సమీపంలో ఏవైనా విద్యుదయస్కాంత క్షేత్రాలు ఉన్నాయేమో గమనించేందుకు ప్రాగ్జిమిటీ సెన్సర్ ఒకటి ఉంది.

అలాగే కీప్యాడ్ లాక్ చేసి ఉన్నప్పుడు దాన్ని అన్లాక్ చేయాలంటే పవర్ బటన్ ఒత్తాల్సిన అవసరం లేదు.. స్క్రీన్ మీద వేలు ఆడిస్తే చాలు.. పాస్వర్డ్ అడుగుతుంది. వాట్సప్ కాలింగ్, మెసేజిలు, పాటలు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ లాంటివన్నీ బాగానే పనిచేస్తున్నాయి. ఫోను వేడెక్కడం కూడా లేదు. ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే ఒకటిన్నర రోజుల పాటు ఉంటోంది. అయితే చిన్న లోపం కూడా ఈ స్మార్ట్ ఫోన్లను వెన్నాడుతుంది. ఫోన్ బ్యాటరీ చార్జింగ్ లేక స్విచ్ అఫ్ అయ్యేప్పుడు అమాంతంగా మెసేజింగ్ టెక్ట్స్ లన్నీ హీందీలోకి మారుపోతున్నాయి. వాటిని తిరిగి సెట్టింగ్స్ లోకి వెళ్లి మార్చుకోవాల్సి వస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : freedom 251  cheapest smart phone  251 phone review  android  Ringing bells  

Other Articles