PM Modi's remarks against cow vigilantes are insulting, says Pravin Togadia

Parivar split wide open as togadia savages modi

beef, cow vigilantes, Cows, gau rakshaks, Narendra Modi, Pravin Togadia, VHP, Vishwa Hindu Parishad, PM modi, Gujarat, Dalit votes

Lashing out at PM, VHP chief Pravin Togadia said that instead of applauding the 'simple Gau Rakshaks' for their efforts, Modi termed 80 per cent of them “anti-social”.

గోరక్షకులపై ప్రధాని వ్యాఖ్యలు అవమానకరం: ప్రవీణ్ తొగాడియా

Posted: 08/14/2016 02:26 PM IST
Parivar split wide open as togadia savages modi

ప్రధాన మంత్రి నరేంద్రమోడీని విశ్వహిందూ పరిషత్ తూర్పారబట్టింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒకలా, ఆ తరువాత మరోలా వ్యవహరిస్తున్నారని వీహెచ్‌పీ అగ్రనేత ప్రవీణ్ తొగాడియా మండిపడ్డారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన వున్నప్పుడు ఎదురైన సమస్యలపై చాతురతతో వ్యవహరించిన మోడీ, ప్రధాని కాగానే మరోలా వ్యవహరిస్తున్నారని తూర్పారబట్టారు. గో రక్షకులను సంఘ విద్రోహ శక్తులుగా పేర్కొని మోదీ వారిని అవమానించారని విశ్వ హిందూ పరిషత్ విమర్శించింది. ‘గో రక్షకుల వివరాలు సేకరించాల్సిందిగా మోదీ రాష్ట్రాలను ఆదేశించడం కూడా సరైన చర్య కాదని అన్నారు.

హిందువులు గోవును రక్షించడానికి ప్రాణాలను సైతం అర్పిస్తారు. కాబట్టి ఆయన జాతి పరంగా జాబితా సిద్ధం చేయమన్నట్లే’ అని తప్పుపట్టారు. దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న మోదీ.. గో హంతకులకు క్లీన్చిట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. అదే సమయంలో గోరక్షకులను బాధితులుగా మారుస్తున్నారని మండిపడ్డారు. గోమాతనే కాకుండా, హిందువులను కూడా మోదీ అవమానించారని తొగాడియా విమర్శించారు. ఇదిలా వుండగా, వచ్చే ఏడాది జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో దళితుల ఓట్ల కోసమే ప్రధాని మోడీ గో రక్షకులపై చర్యలకు పూనుకుంటున్నారన్న అరోపణలు కూడా వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pravin Togadia  gau rakshak  VHP  Narendra Modi  PM modi  Gujarat  

Other Articles