జ్యోతిలక్ష్మీ ఫై ప్రత్యేక కథనం | special story on actress jyothilakshmi

Special story on actress jyothilakshmi

Item Queen is no more, jyothilakshmi passes away, senior actress jyothi lakshmi, tollywood senior actress, Jyothi Lakshmi Passes Away

special story on Item Queen jyothilakshmi.

ఆ పేరంటే కొన్నాళ్లు వణికిపోయారు

Posted: 08/09/2016 09:57 AM IST
Special story on actress jyothilakshmi

ఐటెం సాంగ్ ల క్వీన్, ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఏళ్ల పాటు ఇండస్ట్రీని ఊపేసింది. 70వ దశకంలో యూత్ కు ఆమె అందాలే కనువిందు. డాన్స్ క్రూ లో ఒకదానిగా కెరీర్ ప్రారంభించి ఆపై చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి, తన అందచందాలతో ఆనాటి కుర్రకారు మతిపోగొట్టిన నటి. ఇంకోవైపు వ్యాంప్ తరహా పాత్రలకు పెట్టింది పేరు. ఎన్టీ రామారావు, కృష్ణ వంటి దిగ్గజాల సరసన జ్యోతిలక్ష్మి లేదా జయమాలినితో ఓ పాట లేని సినిమా చాలా అరుదుగా వచ్చేవి.

కొన్నాళ్లకు పరిస్థితి ఎలా మారిపోయిందంటే... ఆమె పాట ఒక్కటి ఉంటే చాలు, సినిమా సూపర్ హిట్టే అన్న భావన నెలకొంది. జ్యోతిలక్ష్మి వయ్యారాలు, నడుము తిప్పుతూ చేసే నృత్యాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయేవారు. దాదాపు 300 చిత్రాల్లో ఆమె నటిస్తే, అందులో 250 వరకూ ఐటమ్ సాంగ్స్ ఉన్నాయంటే, ఆమె హవా ఎలా నడిచిందో చెప్పుకోవచ్చు. ఆ టైంలో ఆమె పేరంటే తల్లిదండ్రులు వణికిపోయే వారు. తెలుగు ప్రజల ఇంట అమ్మాయి పుట్టి ఒకవేళ జ్యోతిలక్ష్మి అనే పేరు పెట్టాలన్న ప్రతిపాదన వస్తే చాలూ ససేమిరా అనేవారు. కొందరికి మనసులో పెట్టాలనే ఉన్నా పెళ్లాలకు భయపడి ఆ పేరు ఎత్తాలంటేనే వణికిపోయేవారు. ఆ పరిస్థితి కొన్ని ఏళ్లపాటు కొనసాగిందంటే అతిశయోక్తి కాదు.

జ్యోతిలక్ష్మి ప్రభంజనం :
 
ఎనిమిదేళ్ల ప్రాయంలో శివాజీ గణేశన్ నటించిన 'కార్తవరాయన్' చిత్రంలో నృత్యం చేసి తెరపై కాలుపెట్టిన జ్యోతిలక్ష్మి, 1967లో వచ్చిన 'పెద్దక్కయ్య' చిత్రంలో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. 1973లో శోభన్ బాబు హీరోగా నటించిన 'ఇదా లోకం' చిత్రంలో 'గుడి ఎనకా నా సామి గుర్రమెక్కి కూకున్నాడు' అంటూ వచ్చిన పాటతో ఆమె అభిమానుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'సర్దార్ పాపారాయుడు' 50 రోజులు ఆడిన తరువాత, కాస్తంత కలెక్షన్లు తగ్గాయని అనిపించడంతో దాసరి స్వీయంగా రాసిన 'జ్యోతిలక్ష్మి చీరకట్టింది...' అనే పాటను జత చేయటం, ఆ పాట కోసమే సినిమాను మళ్లీ ఓసారి తెలుగు రాష్ట్రాల జనాలు చూశారంటే... దటీజ్ జ్యోతిలక్ష్మి. మోసగాళ్లకు మోసగాడు, గండరగండడు, పిల్లా పిడుగా, గాంధర్వ కన్య, సీతారాములు, బెబ్బులి, బాబులుగాడి దెబ్బ, స్టేట్ రౌడీ, బిగ్ బాస్, కలుసుకోవాలని, దొంగరాముడు అండ్ పార్టీ, బంగారుబాబు తదితర చిత్రాల్లో గుర్తింపును తెచ్చే పాత్రలు పోషించి మెప్పించారు.

సిల్క్ స్మిత వంటి నవతరం డ్యాన్సర్లు తెరపైకి వచ్చిన తరువాత, జ్యోతిలక్ష్మికి అవకాశాలు తగ్గిపోగా, ప్రముఖ కెమెరామెన్ సాయిప్రసాద్ ను వివాహం చేసుకుని చిత్రసీమకు దూరమయ్యారు. మధ్యలో అడపాదడపా అందివచ్చిన పాత్రలను పోషిస్తూ వచ్చారు. కొన్నేళ్లుగా బుల్లితెరలోనూ ఆమె హవా నడిచింది కూడా. అలాంటి నటి బ్లడ్ కాన్సర్ తో మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆమె మృతికి తెలుగు విశేష్ ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ... నివాళులు అర్పిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Item Queen  jyothi lakshmi  Passes away  

Other Articles