Telangana police raids gangster nayeem relatives residence

Telangana police raids gangster nayeem relatives residence

gangster nayeem, currency bundles, land documents, weapons, shadnagar, mahaboobnagar, Telangana

gangster Nayeem residence and guest houses raided by telangana police on Tuesday, along with his relatives and close friends houses. police questioning his family members

నయీమ్ బంధువులు, అనుచరుల ఇళ్లలో కొనసాగుతున్న తనిఖీలు

Posted: 08/09/2016 08:33 AM IST
Telangana police raids gangster nayeem relatives residence

మావోయిస్టుగా జీవితాన్ని ప్రారంభించి.. తరువాత కోవర్టుగా మారి.. పోలీసులచేత పెంచి పోషించబడి.. చివరకు వారికే సవాల్ విసిరి.. ఎట్టకేలకు వారి చేతలోనే హతమైన గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీం అనుచరులు, బంధువుల ఇళ్లలో పోలీసులు ఇవాళ కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న పలువురు బంధువుల ఇళ్లలో సోదాలు చేసిన పోలీసులు ఆయనకు చెందిన గెస్ట్ హౌజ్ నుంచి కోట్ల రూపాయల డబ్బును ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా నయీమ్‌ సోదరి సహా బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారి ఇంట్లో నుంచి తల్వార్, తపంచాతోపాటు డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అలాగే అతడి అనుచరుల ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. టమాట శ్రీను ఇంట్లో తపంచా, డాక్యుమెంట్లు... జహంగీర్ ఇంటి నుంచి తల్వార్, డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నయిం అత్తవారి ఇంటి నుంచి 400 డాక్యుమెంట్లు, డిటోనేటర్లు, తపాకీ స్వాధీనం చేసుకున్నారు. భువనగిరి ఎంపీపీ తోటకూరి వెంకటేశం ఇంటి నుంచి కూడా పలు డాక్యుమెంట్లు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నయీమ్‌ అనుచరులు పునపూరి శంకర్, గుండు వెంకటేశ్ ఇళ్లలో నుంచి తపంచా, డిటోనేటర్లతోపాటు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gangster nayeem  currency bundles  land documents  weapons  shadnagar  mahaboobnagar  Telangana  

Other Articles