నయీం లిస్ట్ లో కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ | KCR family members targeted by Naeem

Kcr family members targeted by naeem

Gangster Family list, KCR family in hit list, Naeem encounter, Naeem KCR, KCR family Naeem, KCR close aid in Naeem Target

Telangana Family members in Naeem target list.

కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్ నే టార్గెట్ చేశాడా???

Posted: 08/09/2016 10:09 AM IST
Kcr family members targeted by naeem

పాలమూరు ఎన్ కౌంటర్ లో చనిపోయిన కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తర్వాత విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. వేల కోట్లు కూడబెట్టిన నయీం ఇళ్లలో సోదాలు నిర్వహించిన పోలీసులకు దొరికిన ఆధారాల ప్రకారం నయీం నెక్స్ట్ టార్గెట్ భారీ ఎత్తున ఉండబోతుందని తెలిసింది.

షాద్ నగర్ ఎన్ కౌంటర్ తర్వాత హుటాహుటిన నయీం బంధువుల ఇళల్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు విస్మయానికి గురిచేసే ఆధారాలు దొరికాయి. ఈ కథనం ప్రకారం... నయీమ్ ఏకంగా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువులనే టార్గెట్ చేశాడట. కేసీఆర్ కుటుంబానికి చెందిన ఓ క్లాస్ 1 కాంట్రాక్టర్ పై కన్నేసిన నయీం, ఆయన నుంచి రూ.50 కోట్ల మేర వసూలు చేయాలని భావించాడట. అయితే నయీమ్ తో మాట్లాడేందుకు సదరు కాంట్రాక్టర్ ససేమిరా అన్నాడని తెలుస్తోంది,.

దీంతో నేరుగా రంగంలోకి దిగిన నయీం తన మనుషులతో సదరు కాంట్రాక్టర్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి ఆయనను తీవ్ర భయాందోళనలకు గురి చేశాడంట. ఈ క్రమంలో సదరు కాంట్రాక్టర్ నుంచి మొత్తం విషయం తెలుసుకున్న కేసీఆర్ నయీమ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆ కథనం చెబుతోంది. ఆపై పక్కా ఇంటలిజెన్స్ సమాచారంతోనే నయీంను లేపేసినట్లు తెలుస్తోంది.

ఇక తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కు కూడా నయీం నుంచి ఎదురైన ఓ ఇబ్బంది కూడా కాస్తంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాజీ మావోయిస్టు సాంబశివుడు హత్య అనంతరం ఆయన సోదరుడు రాములుకు కూడా నయీమ్ నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో బెంబేలెత్తిపోయిన రాములు, ఈటెలను శరణు వేడారు. విషయంపై ప్రభుత్వంతో మాట్లాడిన రాములుకు భద్రత కల్పించారు. దీనిని మనసులో పెట్టుకున్న నయీం మంత్రి డ్రైవర్ ను కిడ్నాప్ చేసి తీవ్ర చిత్రహింసలకు గురి చేశాడు. ఆపై విషయం తెలుసుకున్న ఈటెల పార్టీ పెద్దలకు ఈ విషయం చెప్పగా, వారి జోక్యంతో నయీం చెర నుంచి ఈటల డ్రైవర్ కు విముక్తి కల్పించినట్లు తెలుస్తోంది.

మరోవైపు అతనికి అన్ని విషయాల్లో సహకరించారన్న ఆరోపణలపై ముగ్గురు రిపోర్టలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నయీంతో చేతులు కలిపి మోసాలకు పాల్పడుతుండటంతోపాటు, బడా బాబుల వివరాలను ఎప్పటికప్పుడు అందజేసింది వీరేనని పోలీసులు అనుమానిస్తున్నారు. నయీం పేరు చెప్పుకుని రూ. 35 కోట్ల అక్రమ ఆస్తులు వీరు వెనకేసినట్లు విచారణలో తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naeem  target  KCR  Family members  

Other Articles