Friendship Day Special: A Bond That Bloomed Despite All Odds

Friends are the new family in every one s life

friendship day, happy friendship day, sultan, dishoom, john varun, salman khan, bajrangi bhaijaan salman, friendship day 2016, friendship day bollywood, bollywood friendship day, queen, friendship day films, friendship day messages, bollywood friends, bollywood films on friendship, friendship day news, tanu weds manu, 2016 friendship day, friendship day 2016

Best friend is a trope Bollywood keeps on repeating ad nauseam. But on Friendship Day 2016, trust us you, ‘best friend’ has broken from shackle of boring and clichéd script.

ఈనాటి ఈ బంధమే.. తోడుండే స్నేహబంధం..

Posted: 08/07/2016 07:40 AM IST
Friends are the new family in every one s life

చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నాననీ నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని.. యెవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని, అందరు ఉన్నా ఆప్తుడు నువ్వై చేరువయ్యావని, జన్మకు యెరుగని అనురాగాన్ని పంచుతున్నావని, జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నావని.. శ్వాసతో శ్వాసే చెప్పెను, మనసుతో మనసే చెప్పెను, ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని.. ఈ మధురమైన గానాన్ని వింటే మీకేం గుర్తుకు వస్తుందో తెలుసా.. తెలిసీ తెలియని వయస్సు నుంచి.. ప్రతి మనిషికి తోడుగా వచ్చేది.. అదే స్నేహం.

దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరే జాన్ అంటూ ఎలాంటి అలమరికలు లేకుండా వన్ బై టు చాయ్ ల నుంచి డ్రెస్ లు షూస్ అన్ని షేర్ చేసుకునే వాటిని కూడా నేర్పిస్తుంది స్నేహం. సంతోషాలలోనే కాదు నిరాశా నిస్పృహలు చుట్టుముట్టినపుడు..నీ కోసం నేనున్నాను..అంటూ భుజం తట్టే ఆత్మీయమైన స్పర్శ స్నేహం. ఆనందాన్ని పంచుకుని రెట్టింపు చేస్తుంది.. విషాదాన్ని పంచుకుని  సగానికి సగం తగ్గిస్తుంది.

మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోయి, మనిషన్నవాడు మాయమైపోతున్న తరుణంలో ఇంకా ఎక్కడో ఒక చోట ఆత్మీయమైన స్నేహాలు, ఉన్నతమైన మానవతా విలువలు  వెలుగు రేఖలుగా దారి చూపుతూనే ఉంటాయి. స్నేహమంటే ఒక నులివెచ్చటి స్పర్శ. ఫ్రెండ్ షిఫ్ డే సందర్భంగా తెలుగు విశేష్ పాఠకులకు, శ్రేయోభిలాషులకు స్నేహితుల రోజు శుభాకాంక్షలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : friendship day  friends  hyderabad  students  social media  indians  

Other Articles