India vs West Indies, 2nd Test Day 4: Heavy shower interrupt play again at Kingston, visitors trail by 298 runs

Heavy shower interrupt play again at kingston visitors trail by 298 runs

india vs west indies, ind vs wi, ind wi, india west indies, ajinkya rahane, rahane india, india rahane, cricket news, cricket score, cricket, sports news, sports

Ishant Sharma gets first blow for India as Chandrika lets go off a straight one before heavy showet interrupt play on day 4

కోహ్లీ సేన ఇన్నింగ్స్ విజయం అశలపై నీళ్లు చల్లిన వరుణుడు

Posted: 08/02/2016 08:53 PM IST
Heavy shower interrupt play again at kingston visitors trail by 298 runs

నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ తో కింగ్స్టన్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్టులో మరోమారు ఇన్నింగ్స్ విజయంపై గురిపెట్టిన టీమిండియా విజయాలపై వరుణుడు నీళ్లు చల్లాడు. తొలి ఇన్నింగ్స్ లో 196 పరుగులకు అలౌట్ అయిన విండీస్ కు భారత్ ధీటైన జవాబునిచ్చింది. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వల్ప స్కోరుకే పెవిలియన్ దారి పట్టినా.. ఓపెనర్ లోకేష్ రాహుల్ సహా టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానేలు శతకాలతో రాణించి భారత్ భారీ స్కోరును సాధించిపెట్టారు. దీంతో కోహ్లీ సేన విండీస్ పై 304 పరుగుల అధిక్యాన్ని నమోదు చేసింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 500 పరుగుల వద్ద తొమ్మిది విక్కట్ల వద్ద డిక్లేర్ చేసింది.

అయితే విజయం కోసం ఆశగా ఎదురుచూస్తున్న కోహ్లీ సేనను వరుణుడు దెబ్బతీశాడు, నాల్గవ రోజు మైదానంలో విరామం లేకుండా వర్షం పడుతుండటంతో ఆట నిలిచిపోయింది, అయితే అప్పటికే ఇషాంత్ శర్మ విండీస్ ఓపెనర్ వికెట్ ను సాధించాడు, ప్రస్తుతం విండీస్ స్కోరు వికెట్ నష్టానికి అరు పరుగలు సాధించింది. ఆటగాళ్లందరూ పెవిలియన వద్దే పడిగాపులు కాస్తున్నారు. మైదానంలో కవర్లు కప్పి ఉంచారు. ఏ క్షణంలో వర్షం ఆగితే మ్యాచ్‌ను అప్పుడే మొదలుపెడతారు. అయితే వర్షం మాత్రం ఏకధాటిగా కురుస్తూ ఆటగాళ్ల ఆశలపై నీళ్లు చల్లుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ishant sharma  India vs West Indies 2016  Team india  Test series  BCCI  cricket  

Other Articles