Man kills his brother's murderer outside judge's chamber in Rajasthan court

Rajasthan minister s son among 6 named in fir in murder case

Hanumangarh court murder, Rajasthan irrigation minister son, minister son murder case, rajasthan minister ramprasad son, judge chamber murder, Minister Rampratap son, Amit Sahu, murder case. crime

Two men opened fire inside a judge's chamber in Rajasthan's Hanumangarh court killing a man. This story has everything that you'll see in a Bollywood masala flick.

మంత్రి కొడుకుపై మర్డర్ కేసు..

Posted: 08/02/2016 07:15 PM IST
Rajasthan minister s son among 6 named in fir in murder case

న్యాయస్థానంపై మాకు అమితమైన గౌరవం వుంది అంటూ ఇప్పటికే అనేక కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం నుంచి మెట్టికాయలు తగిలినా బీజేపి నేతల్లో మాత్రం మార్పు రావడం లేదు, ఇక తాజాగా రాజస్థాన్ లో మంత్రి రామ్ ప్రతాప్ కుమారుడు అమిత్ సాహు తన అనుఛరులతో న్యాయస్థానంలోనే అందులోనూ న్యాయమూర్తి ఛాంబర్ పక్కన వున్న సాక్షిని దారుణంగా హత్య చేశారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరో హత్య కేసులో సాక్షిగా ఉన్న హరీష్ సింధి అనే వ్యక్తి సోమవారం హనుమాన్ నగర్ కోర్టుకు రాగా, కోర్టు ఆవరణంలో ఇద్దరు దుండగులు ఆయన్ను కాల్చిచంపారు. నిందితులు సుఖ్బీర్, ధర్మేంద్రలను పోలీసులు నిన్ననే అరెస్ట్ చేశారు.

పోలీసులు నిందితులను విచారించిన మీదట ఈ కేసులో మంత్రి కొడుకు అమిత్ సాహూతో పాటు మొత్తం ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధంలేదని సాహు చెప్పాడు. రాజకీయ కారణాలతో తన పేరును ఈ కేసులోకి లాగారని ఆరోపించాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తనను సంప్రదించలేదని తెలిపాడు. కోర్టుకు దగ్గరలోనే ఉన్న కలెక్టర్ కార్యాలయానికి పనిమీద వెళ్లానని, అంతేకాని తనకు ఈ కేసుకు సంబంధంలేదని చెప్పాడు. కాగా ఈ మంత్రి రామ్ప్రతాప్ ఈ కేసు విషయంపై స్పందించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajasthan  Minister Rampratap son  Amit Sahu  murder case  crime  

Other Articles