మహిళ మృతదేహం నుంచి బయటికొచ్చిన ఆత్మ | spirit rising from dead woman's body in China

Spirit rising from dead woman s body in china

Spirit rising from dead body, woman's body, China's spirit out from dead body, spirit rising video

Spirit rising from dead woman's body in China's hospital.

ITEMVIDEOS:బెడ్ మీద శవం... గాల్లో లేచిన ఆత్మ

Posted: 08/01/2016 09:31 AM IST
Spirit rising from dead woman s body in china

మనిషి చనిపోయాక ఏం అవుతాడు? దెయ్యాలు, ప్రేతాత్మలు ఇలాంటివి ఉన్నాయా? అనాదిగా మనిషిని వెంటాడుతున్న సందేహాలు కొన్ని మిస్టరీలుగా అలాగే మిగిలిపోయాయి. సర్వమతాల పవిత్రగ్రంథాలు మాత్రం ఆత్మ అనేది వుందని, తుది శ్వాస విడవగానే అది మృతశరీరం నుంచి బయటకు వెళ్లిపోతుందని వివరిస్తున్నాయి. శాటిలైట్ యుగంలో ఈ మూఢనమ్మకాలు ఏంటహే అనుకునే వారి సంఖ్య తక్కువేం కాదు. ఆత్మ గీత్మ జాన్ తా నై అనడమే అదంతా ట్రాష్ అంటూ పరిశోధనాత్మకంగా నిరూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆత్మలను చూడాలనుకుంటున్న వాళ్లకు ఈ వీడియో ప్రత్యేకం... 

తాజాగా చైనాలోని ఓ ఆసుపత్రిలో మార్చురీ బయట బెడ్ మీద ఓ మహిళ మృతదేహం ఉంది. తెల్లని గుడ్డ కప్పిన ఆ డెడ్ బాడీ నుంచి ఒక్కసారిగా ఏదో ఆకారం లేచి అమాంతం గాల్లో కలిసిపోయింది. అది ఆత్మేనని, ఏదో కదిలి వెళ్లటం తామూ చూశామని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. అక్కడున్న సీసీ పుటేజ్ ల్లో చనిపోయిన మహిళ శరీరం నుంచి ఆత్మ బయటకు వెళ్లడం క్లియర్ గా ఉంది. దీంతో ఆ వీడియోను అక్కడి ఛానెళ్లు ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాయి.

గతంలో దెయ్యాల పేరుతో చాలా ఫేక్ వీడియోలు ఉన్నాయని, ఇది కూడా అలాంటిదేనని పలువురు చెబుతుంటే, చైనాలో ఆత్మ సిద్ధాంతం ఎక్కువగా నమ్ముతారని, ఇలాంటి వాటిని కొట్టిపారేయలేమని మరి కొందరు అంటున్నారు. మరసలు అదేంటో అనేది ప్రస్తుతానికైతే సస్పెన్సే....

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  spirit rising  woman  dead body  

Other Articles