వాణిజ్య పన్నుల వసూళ్లలో తెలంగాణ కంటే ఏపీ ముందు | Andhra Pradesh better than telanagana in IT collection

Andhra pradesh better than telanagana in it collection

Andhra Pradesh better than telanagana IT collection, AP income tax collections, Andhra Pradesh IT amrndments

Andhra Pradesh better than telanagana in IT collection

తెలంగాణకు తొలి దెబ్బేసిన నవ్యాంధ్ర

Posted: 08/01/2016 10:45 AM IST
Andhra pradesh better than telanagana in it collection

తెలంగాణ నుంచి వేరయిన ఆంధ్రకి ఆర్థికంగా తీవ్ర అన్యాయం జరిగిందని మొన్న పార్లమెంట్ సాక్షిగా మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. విడిపోయే నాటికీ రెవెన్యూ పరంగా తెలంగాణ ఫ్లస్ లో ఉంటే, నవ్యాంధ్ర మాత్రం చాలా వెనకబడి ఉందని ఆయన లెక్కలతోసహా తెలిపారు. అయితే ఏపీని పట్టి పీడిస్తున్న నిధుల లేమి ఇక ఎంతో కాలం ఆ రాష్ట్రానికి సమస్యగా పరిణమించే పరిస్థితి కనిపించడం లేదు.

భారీ ఆర్థిక లోటుతో ఇబ్బంది పడుతున్న ఏపీ, నిధుల లేమిని పూడ్చుకునేందుకు చేస్తున్న వ్యూహాలు సత్ఫలితాలనే ఇస్తున్నాయి. పన్ను ఎగవేతలకు చెక్ పెట్టడంతో పాటు లీకేజీలను అరికట్టేందుకు ఏపీ వాణిజ్యపన్నుల శాఖ చేపట్టిన సంస్కరణలు సక్సెస్ అవుతున్నాయి. ఈ ఏడాది (2016-17 ఆర్థిక సంవత్సరం) తొలి త్రైమాసికంలో ఈ సంస్కరణలు మంచి ఫలితాలనిచ్చాయి.

సంస్కరణల ఫలితంగా ఆదాయాన్ని భారీగా పెంచుకోవడమే కాకుండా దేశంలోనే వాణిజ్యపన్నుల వసూళ్లలో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత మిగులు రాష్ట్రంగా వినుతికెక్కిన తెలంగాణను కూడా ఏపీ వెనక్కు నెట్టేసింది. వాణిజ్యపన్నుల వసూళ్లలో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో నిలవగా, తెలంగాణ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. వాణిజ్యపన్నుల వసూళ్లలో ఏపీ 14.64 శాతం వృద్ధి నమోదు చేయగా, తెలంగాణ 14.55 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసింది.

తద్వారా ఆర్థికంగా ప్రగతిని సాధించడంతోపాటు ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న తెలంగాణకు మొదటి దెబ్బ వేసినట్లు అయ్యింది. అయితే హోదా, ప్యాకేజీ కోసం పోరుబాట పట్టిన ఈ సమయంలో కేంద్రం హఠాత్తుగా జాబితా విడుదల చేయటం వెనుక వేరే మర్మం ఏంటనీ పలువురు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  telangana  Income Tax  amendments  

Other Articles