కాబూల్ లో ట్రక్ బాంబుతో తాలిబన్ల దాడి | Large explosion hits Kabul 100 killed

Large explosion hits kabul 100 killed

compound housing foreigners, Kabul truck bomb attack, Taliban attack in Kabul, Afghanistan Taliban attack

Large explosion hits Afghanistan's capital city of Kabul. 100 died in attack on compound housing foreigners. Taliban takes responsibility for that.

ఆఫ్ఘనిస్థాన్ లో ట్రక్ బాంబు దాడి... 100 మంది మృతి?

Posted: 08/01/2016 08:19 AM IST
Large explosion hits kabul 100 killed

ఉగ్ర పంజాకు ఆఫ్ఘనిస్థాన్ మరోమారు రక్తసిక్తమైంది. ఆదివారం అర్థరాత్రి దాటాక జరిగిన బాంబుదాడితో కాబూల్ ఒక్కసారిగా వణికిపోయింది. విదేశీయులు ఉంటున్న గెస్ట్‌హౌస్‌పై ఉగ్రవాదులు ట్రక్‌బాంబుతో దాడిచేశారు. ఈ ఘటనలో వంద మంది దాకా మృతి చెందగా, లెక్కలేని సంఖ్యలో గాయపడినట్టు సమాచారం. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

అమెరికా నిర్వహణలో ఉన్న బగ్రాం ఎయిర్‌బేస్‌కు సమీపంలో ఓ హోటల్‌లోకి నార్త్‌గేట్ ద్వారా ట్రక్‌తో ప్రవేశించి పేల్చివేసినట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతానికి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్ల కిటికీ అద్దాలు ధ్వంసం కావడం దాడి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ దాడికి తామే బాధ్యులమని తాలిబన్ ప్రకటించింది. భారీ ఎత్తున పేలుడు పదార్థాలతో నిండి ఉన్న ట్రక్‌తో హోటల్‌ను ఢీకొట్టినట్టు పేర్కొంది.

ఘటనపై స్పందించేందుకు అధికారులు అందుబాటులోకి లేకపోవటంతో ప్రాణనష్టంపై అధికారిక సమాచారం కోసం వేచిచూడాల్సి వస్తోంది. జూలై 23, 2001లో కాబూల్ లో జరిగిన ‘ట్విన్‌బాంబ్’ దాడి తర్వాత మళ్లీ జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని అధికారులు భావిస్తున్నారు. అప్పటి ఘటనలో 80 మంది పౌరులు మృతిచెందారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Afghanistan  Kabul  Taliban  Truck bomb  

Other Articles