Couple trying to conceive baby arrested for public sex on top of car in Northampton

Hot couple arrested for public sex in northampton

white sedan, baby, public sex, crime, Northampton, Northampton District Court, Ludlow couple, Timothy Saxer, Danielle Stuart, Couple trying to conceive baby, couple arrested for public sex, couple sex on top of car, Mill River, Officer Thomas Briotta, northampton, northampton-police

Northampton officers responded to Riverside Drive near Norwood Avenue after receiving reports of a naked man and woman having sex on top of a white sedan at mill river

సంతానం కోసం.. నదీ తీరాన.. పబ్లిక్ గా శృంగారం..

Posted: 07/29/2016 10:55 AM IST
Hot couple arrested for public sex in northampton

రవి అస్తమించని దేశంగా ఖ్యాతి చెంది.. ప్రపంచాన్నే పాలించిన వారిగా బిరుదులు పొందిన దేశంలోనూ మూడనమ్మకాలకు కొదవలేదని రుజువు చేస్తుంది ఈ ఘటన. శాస్త్రసాంకేతిక పరంగా ఎంతో ప్రగతి సాధించినా.. వైద్య శాస్త్రంలో కనివినీ ఎరుగని రీతిలో అభివృద్ది చెందుతున్నా.. వాటిని కాదని కేవలం మూఢనమ్మకాలను విశ్వసించిన ఓ జంట.. కటకటాల వెనక్కి వెళ్లారు. తాము విశ్వసించే మూడనమ్మకాలే వారికి ఎలాంటి హితము చేయకపోగా, పైపెచ్చు ఇబ్బందుల పాలుచేసింది. ఇంగ్లాండ్ లోని నార్తంప్టన్‌కు చెందిన దంపతులు ఓ మూఢనమ్మకాన్ని గుడ్డిగా ఫాలో కావడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే చివరకు వారు నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానం వారికి వంద డాల్లర్లను అపరాధ రుసుముగా విదింఛడంతో దాన్ని చెల్లించి దంపతులు బయటకు వచ్చారు.
 
అసలు వారు చేసిన నేరమేంటి అంటారా.. వివరాల్లోకి వెళ్తే నార్తంప్టన్‌కు చెందిన తిమోతీ సాసర్, డానియల్లీ సువార్ట్ దంపతులకు వివాహమై చాలా ఏళ్లైనా వారికి పిల్లలు కలగలేదు. పిల్ల్లలు పుట్టడానికి ఎంతో సాంకేతికంగా అభివృద్ధి చెందిన వైద్య రంగాన్ని ఆశ్రయించకుండా, ఓ మూఢనమ్మకాన్ని అశ్రయించారు. ఏదో ఒక నది ఒడ్డున సాయంత్రం సమయంలో పబ్లిగ్గా శృంగారంలో పాల్గొంటే పిల్లలు కచ్చితంగా పుడతారని ఎవరో చెప్పిన మాట విని, దాని ఆచరించడానికి సిద్ధమయ్యారు. ఆ వ్యక్తి చెప్పినట్టే నదీ తీరానికి వెళ్లి పబ్లిగ్గా సరస సల్లాపాలకు దిగారు. ఈ దృశ్యాన్ని చూసిన చట్టుపక్కల వారు పోలీసులకు కంప్లైంట్‌ ఇచ్చారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారి ఆచూకీ తెలుసుకుని అరెస్ట్‌ చేశారు. అలా పబ్లిగ్గా శృంగారంలో పాల్గొంటే పిల్లలు పుడతారనే నమ్మకంతోనే అలా చేశామని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ludlow couple  Mill River  white sedan  baby  public sex  northampton police  crime  

Other Articles