Poaching cases against Salman Khan: His ‘unreliable’ statement set aside by HC, key witness ‘reappears’

Salman khan s acquittal to be challenged says rajasthan minister

poaching, salman khan, salman khan poaching cases, poaching cases salman khan, chinkara case, harish dulani, black buck case, black buck poaching case, dulani statement, salman khan news, ham saath saath hai, bollywood news

It was during the probe into the alleged blackbuck poaching case of October 1998 that Dulani informed the Forest Department of two cases of alleged chinkara poaching, on September 26 and 28 in the same year.

ITEMVIDEOS: సల్మాన్ కృష్ణ జింకల కేసులో మరో ట్విస్టు..

Posted: 07/28/2016 01:54 PM IST
Salman khan s acquittal to be challenged says rajasthan minister

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ చుట్టూ మళ్లీ ఉచ్చు బిగిసుకుంటుందా..? అంటే అవుననే కనిపిస్తున్నాయి పరిస్థితులు. కృష్ణ జింకల వేట కేసు మరో ట్విస్టు ఏర్పడింది. గత కొన్నేళ్లుగా కనిపించకుండా పోయిన ఈ కేసులోని కీలక సాక్షి మళ్లీ తెరపైకి ప్రత్యక్షం కావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. జింకలను చంపింది సల్మాన్ ఖానేనని ఆనాడు జీపు డ్రైవర్‌గా ఉన్న హరీష్ దులానీ చెప్పడంతో కేసు మళ్లీ మొదటి వచ్చేలా కనబడుతోంది. 2002 నుంచి కనిపించకుండా పోయిన హరీష్ హఠాత్తుగా తెరపైకి వచ్చి ఈ కేసులో కండల వీరుడే నిందితుడని చెప్పాడు.

'నన్ను చంపుతామని మా నాన్నను బెదిరించారు. దీంతో భయపడి జైపూర్ వదిలి పారిపోయాన'ని హరీష్ దులానీ చెప్పాడు. తనకు రక్షణ కల్పించివుంటే కోర్టులో సాక్ష్య చెప్పేవాడినని అన్నాడు. లిఖితపూర్వకంగా కోరితే అతడికి భద్రత కల్పిస్తామని రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా తెలిపారు. ఈ కేసుల కీలక సాక్షిగా వున్న హరీష్ దులానీ సాక్షం చెప్పేందుకు రాకపోవడంతో.. సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట రాజస్తాన్ అత్యున్నత న్యాయస్థానం సల్మాన్ ఖాన్ నిర్దోషగా ప్రకటించింది.

హరిష్ దులాని మళ్లీ తెరపైకి రావడం.. కృష్ణ జింకల వేట కేసులో ఆయనే దోషని చెప్పడంతో రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని న్యాయశాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్ వెల్లడించారు. 1998లో జోధ్‌పూర్‌కు సమీపంలోని భావద్, మథానియా ప్రాంతాల్లో సల్మాన్, అతని సహ నటులు కలసి కృష్ణజింకలను వేటాడిన కేసులో సరైన సాక్షాలు లేవని 'సుల్తాన్' స్టార్ ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Harish Dulani  Black buck poaching case  bollywood  

Other Articles