ఒబామా షార్ట్ ఫిల్మ్ లో మోదీకి మాత్రమే దక్కినచోటు | Modi only world leader in Barack Obama's DNC introduction video

Modi only world leader in barack obama s dnc introduction video

Narendra Modi in Obama short film, Narendra Modi Only World Leader in modi movie, modi pic in obama short film

Narendra Modi Only World Leader Sharing Frame with Obama in Film on his Tenure.

పెద్దన్న సినిమాలో మోదీ మెరుపులు

Posted: 07/28/2016 03:56 PM IST
Modi only world leader in barack obama s dnc introduction video

అమెరికాకు అధ్యక్షుడిగా, దేశాలన్నీంటికి పెద్దన్నగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు బరాక్ ఒబామా. మరికొద్ది రోజుల్లో ఆయన ఆ పదవి నుంచి దిగిపోబోతున్నారు. అదే సమయంలో తన పార్టీ తరపున అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు మద్ధతుగా ఫిలడెల్ఫియాలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని గెలిపించాలని ఆయన ప్రజలను కోరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రెండు దఫాల ఆయన పదవీకాలంపై ఓ షార్ట్ ఫిల్మ్ ప్రదర్శించారు.

ఐదు నిమిషాల నిడివిగల ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఒబామాకలిసి ఉన్న ఒక ఫొటోను వాడుకున్నారు. ఇది ప్రధాని మోదీకి దక్కిన అరుదైన గౌరవంగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ షార్ట్ ఫిల్మ్ లో కనిపించిన ఏకైక విదేశీ నేత మోదీయే. ఒబామా మోదీకి ఎంతటి అనుబంధం ఉందో ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ దేశాలన్నీ తన కోసం ఆతిథ్యం సిద్ధం చేస్తుంటే తాను మాత్రం మోదీకి ఆతిథ్యం కల్పించే భాగ్యం కోసం ఎదురు చూస్తున్నానని ఒబామా ప్రకటించడం వీరి మధ్య ఎలాంటి సాన్నిహిత్యం ఉందో చెప్పేస్తుంది. అలాంటిది ప్రపంచ అగ్రదేశాల అధినేతలను కూడా కాదని ఈ చిత్రంలో కేవలం మోదీ ఫోటోను మాత్రమే వాడుకోవటం ఆకర్షనీయంగా మారింది.

ఇక ఈ షార్ట్ ఫిల్మ్ లో మోదీ కాకుండా బయటి వ్యక్తుల్లో యూఎన్ ఓ సెక్రటరీ జనరల్ బాన్ కీమూన్ కూడా కనిపించారు. ఒబామా పాలనలో సాధించిన విజయాలతోపాటు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, అల్ ఖైదా చీఫ్ లాడెన్ ను మట్టుపెట్టడం వరకు ఉన్న ఎన్నో విషయాలు ఇందులో చూపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Obama  short film  DN convention  

Other Articles